ఎన్నిరోజులైనా.. ఎన్నిసార్లయినా..

ఒకసారి ప్రవక్త అబూ మస్‌ వూద్‌ (స) సహచరుడు తన బానిసను దండిస్తుండగా వెనక నుంచి ‘తెలుసుకో, తెలుసుకో’ అనే మాటలు వినిపించాయి.

Published : 23 Feb 2023 00:14 IST

కసారి ప్రవక్త అబూ మస్‌ వూద్‌ (స) సహచరుడు తన బానిసను దండిస్తుండగా వెనక నుంచి ‘తెలుసుకో, తెలుసుకో’ అనే మాటలు వినిపించాయి. గబుక్కున వెనుతిరిగి చూస్తే ప్రవక్త (స) నిలబడి ఉన్నారు. ఆశ్చర్యంగా చూస్తోంటే ‘నీకు ఈ బానిసపై ఎంత అధికారముందో అంతకన్నా ఎక్కువ అధికారమే దైవానికి నీపైన ఉంది’ అన్నారాయన. అక్కడే ఉన్న మరో వ్యక్తి ‘ప్రభూ! నా సేవకుడు తప్పులు చేస్తుంటాడు. అతణ్ణి ఎన్నిసార్ల వరకూ క్షమించాలి?’ అనడిగాడు. ప్రవక్త (స) మౌనం వహించారు. అతడు మళ్లీ ప్రశ్నించగా, ‘రోజుకు 70సార్లయినా మన్నించాలి’ అన్నారు. సేవకులను ఎన్నిసార్లయినా క్షమించాలన్నదే ఆయన ఉపదేశం.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని