నేను చనిపోతే?
గాసన్ ప్రార్థన మందిరానికి వెళ్లినప్పుడు టెకిసూయ్ కనిపించేవాడు.
గాసన్ ప్రార్థన మందిరానికి వెళ్లినప్పుడు టెకిసూయ్ కనిపించేవాడు.
కొన్నాళ్లకి ఆ ప్రార్థన మందిరం అగ్నిప్రమాదానికి గురైంది.
గాసన్ దాని పునర్నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటున్నాడు.
అక్కడ కడుతున్న వేదికను చూసి, ‘ఇదంతా పూర్తయ్యాక ఏం చేద్దామను కుంటున్నావు?’ అనడిగాడు టెకిసూయ్.
‘నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు కదా! దాన్నుంచి బయటపడ్డాక నువ్వీ వేదిక మీద మాట్లాడొచ్చు’ అన్నాడు గాసన్.
‘కానీ ఆ లోపే నేను చనిపోతే?’ బాధగా అన్నాడు టెకిసూయ్.
‘వక్తగా మరెవరినైనా ఎంచుకుంటాను’ చెప్పాడు గాసన్.
‘కానీ ఎవరూ దొరక్కపోతే?’
‘చాలిక ఆపు! ఆశావాదంతో దేన్నయినా సాధించవచ్చు. నిరాశతో జీవిస్తే ఉన్నవి కూడా విధ్వంసమైపోతాయి. దయచేసి నీ నిరాశావాదాన్ని ఇంకెవరికీ పంచకు’ తీవ్ర స్వరంతో అన్నాడు గాసన్.
టెకిసూయ్ ఇంకేం మాట్లాడకుండా అక్కణ్ణించి వెళ్లిపోయాడు.
వి.నాగరత్న
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Law Commission: అప్పట్లో.. శృంగార సమ్మతి వయసు ‘పదేళ్లే’!