విలువైంది.. అరుదైంది

స్వామి వివేకానంద వివిధ నగరాల్లో ప్రసంగిస్తు న్నారు. ఒకరోజు విరామ సమయంలో ఓ వ్యక్తి స్వామికి నమస్కరించి ‘అయ్యా, లోకంలో అతి విలువైందీ.. అరుదైందీ.. ఏమిటో కాస్త చెప్పండి’ అనడిగాడు.

Updated : 02 Mar 2023 03:21 IST

స్వామి వివేకానంద వివిధ నగరాల్లో ప్రసంగిస్తు న్నారు. ఒకరోజు విరామ సమయంలో ఓ వ్యక్తి స్వామికి నమస్కరించి ‘అయ్యా, లోకంలో అతి విలువైందీ.. అరుదైందీ.. ఏమిటో కాస్త చెప్పండి’ అనడిగాడు. స్వామి తల పంకించి ‘లోకం విచిత్రమైంది. అది దేశకాల పరిస్థితులకు బందీ అయ్యింది. అందుకే ఏదైనా దేశం, కాలం, పరిస్థితిని అనుసరించి మారుతూ ఉంటుంది. నదీతీరంలో మంచినీళ్లు విలువైనవని తోచకపోవచ్చు. కానీ ఆ నీరే ఎడారి ప్రాంతంలో ప్రాణాన్ని నిలిపే అమృతమవుతుంది. రోజూ పాయసం తాగేవారికి గంజి రుచిగా అనిపిస్తే గంజి తాగి బతికేవాళ్లు పాయసం గురించి కలలు కంటారు. ఈరోజు విలువైందిగా అనిపించిన వస్తువు రేపు వెల లేనిదిగా అనిపించవచ్చు. దేశకాలాలతో సంబంధం లేకుండా అందరికీ అన్ని వేళలా అన్ని ప్రదేశాల్లో ఎంతో అవసరమైంది ఒకటుంది. అదే మనశ్శాంతి. మనకు ఉన్నదంతా ధార పోసినా శాంతి దొరకదు కదా! అది లేనప్పుడు ఇంకేమున్నా వ్యర్థమే. శాంతి సొంతమైతే మరేమీ లేకున్నా వారితో సరితూగే సంపన్నులెవరూ లోకంలో ఉండరు. అది అమూల్యం, అపురూపం. కనుక లోకంలో అతి విలువైందీ, అరుదైందీ, అందరికీ కావవలసిందీ మనశ్శాంతి’ అంటూ వివరించారు. ఆ మాటలు విన్న అతడు అప్రయత్నంగా చేతులు జోడించాడు. 
శ్రీప్రద అగ్నిహోత్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని