ధర్మసూక్ష్మమంటే...
ధర్మం గురించి మనందరికీ తెలుసు. కానీ ధర్మ సూక్ష్మం గురించి ఎక్కువమందికి తెలియదు కదూ! శిబిచక్రవర్తి భృగుతుంగ పర్వత శిఖరం మీద యజ్ఞం చేస్తుండగా అతని సద్గుణాన్ని పరీక్షించాలనుకున్నారు ఇంద్రాదులు.
ధర్మం గురించి మనందరికీ తెలుసు. కానీ ధర్మ సూక్ష్మం గురించి ఎక్కువమందికి తెలియదు కదూ! శిబిచక్రవర్తి భృగుతుంగ పర్వత శిఖరం మీద యజ్ఞం చేస్తుండగా అతని సద్గుణాన్ని పరీక్షించాలనుకున్నారు ఇంద్రాదులు. అంతే.. అగ్ని పావురంగా రూపు దాల్చాడు. ఇంద్రుడు డేగగా మారి పావురాన్ని తరమ సాగాడు. భయపడిన పావురం శిబిని శరణు కోరగా.. దాన్ని వెంటాడుతూ వచ్చిన డేగ శిబిని చూసి ‘మహారాజా! ఇది నాది. నువ్వు గొప్ప ధర్మ మూర్తివని విన్నాను. ఆకలితో ఉన్న నాకు ఆహారాన్ని దక్కకుండా చేయడం ధర్మమా? మా డేగలకు ఆహారం పావురాలని వేదాలే చెప్పాయి. కనుక నీ వెనక నక్కి, నీ రక్షణలో ఉన్న పావురాన్ని వదులు. లేదంటే నేనూ, నా కుటుంబం ఆకలితో అలమటిస్తాం. ఒక జీవిని కాపాడేందుకు ఇందరిని హింసిస్తావా?’ అన్నాడు.
‘ఇది ప్రాణభయంతో నన్ను ఆశ్రయించింది. విడిచిపెట్టడం న్యాయం కాదు. ఆశ్రిత త్యాగం అధర్మమవుతుంది. నీ ఆకలి తీర్చేందుకు మరేదైనా జంతువును ఇస్తాను’ అంటూ డేగకు ధర్మసూక్ష్మాన్ని వివరించాడు శిబిచక్రవర్తి.
‘రాజా! నువ్వంత త్యాగమూర్తివైతే పావురం ఎత్తు మాంసాన్ని నీ శరీరంలోంచి ఇవ్వు. నేనిక దాని జోలికి పోను’ అన్నాడు డేగ. శిబి వెంటనే త్రాసు తెప్పించాడు. అందులో ఒకవైపు పావురాన్ని ఉంచి, రెండోదాంట్లో తన మాంసాన్ని కోసి పెట్టసాగాడు. తక్కెడ సరితూగకపోయేసరికి తానే కూర్చున్నాడు. తన ప్రాణాన్ని లక్ష్యపెట్టక శరణాగత ప్రాణిని రక్షించేందుకు పూనుకున్న శిబిచక్రవర్తి స్థైర్యానికి, ధర్మనిరతికి ముచ్చటపడిన దేవేంద్రుడు, అగ్నిదేవుడు నిజస్వరూపాలతో ప్రత్యక్షమయ్యారు. నీ త్యాగం అద్భుతం, నీ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది అంటూ ప్రశంసించి అంతర్థానమయ్యారు. పావురం డేగకు ఆహారమన్నది ధర్మం. శరణాగతి పొందిన పావురాన్ని రక్షించడం ధర్మసూక్ష్మం.
పులిగడ్డ విజయలక్ష్మి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur Violence: మణిపుర్ సీఎం ఇంటిపై దాడి చేసేందుకు అల్లరిమూక ప్రయత్నం
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు..12 రాశుల ఫలితాలు ఇలా... (29/09/2023)
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Netherlands: నెదర్లాండ్స్లో కాల్పుల కలకలం.. తొలుత ఓ ఇంటిపై.. ఆతర్వాత ఆసుపత్రిలో