అతడేం సాధువు?!

చైనాలో ఓ వృద్ధురాలు ఒక సన్యాసికి ఇరవయ్యేళ్లు సాయం చేసింది. అతడు నివసించడానికి, ధ్యానం చేసుకోవడానికి పాక కూడా ఏర్పాటుచేసింది. ఈ సుదీర్ఘ కాలంలో అతడెంత పురోగతి సాధించాడో చూడాలనుకుంది.

Updated : 23 Mar 2023 03:55 IST

చైనాలో ఓ వృద్ధురాలు ఒక సన్యాసికి ఇరవయ్యేళ్లు సాయం చేసింది. అతడు నివసించడానికి, ధ్యానం చేసుకోవడానికి పాక కూడా ఏర్పాటుచేసింది. ఈ సుదీర్ఘ కాలంలో అతడెంత పురోగతి సాధించాడో చూడాలనుకుంది. ఇంతలో ఒక పేదపిల్ల వచ్చింది. పెద్దావిడ ఆ అమ్మాయితో.. ‘నువ్వో పని చెయ్యి! ఆ సాధువు దగ్గరికెళ్లి ఆలింగనం చేసుకో! నీ పరిస్థితి వివరించి చెప్పు’ అంది.
ఆ అమ్మాయి అలాగే చేసింది. సన్యాసి తాపీగా నవ్వుతూ ‘రాళ్ల మీద విత్తనాలు పడితే ఏమవుతుంది?! చలికాలంలో మొలకెత్తి ఎదగాల్సిందే.. అంతకంటే చేయగలిగింది ఏముంటుంది?’ అన్నాడు. ఆమె తిరిగొచ్చి జరిగింది చెప్పింది. అది విన్న వృద్ధురాలు చలించిపోయింది. ‘నువ్వెంత అవసరంలో ఉన్నావో అతడికి పట్టలేదు. దయ కురిపించడం కాదు కదా.. కనీసం కాస్త సానుభూతి కూడా చూపలేక పోయాడు. మానవత్వం లేనివాడు అతడేం సాధువు? ఇరవై ఏళ్లుగా పోషిస్తున్నాను’ అంటూ వెళ్లి అతడి పాకను పీకేసింది.                      
వి.నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని