శాశ్వతానందం కావాలంటే...
ఒకసారి విద్యాప్రకాశానందగిరి స్వామి ‘శాశ్వత ఆనందం లభించాలంటే ఏం చేయాలో మీకో కథ చెబుతాను... ఆంజనేయుణ్ణి ఆరాధించే ఒక వ్యక్తి తన భక్తికి చిహ్నంగా మారుతి బొమ్మను చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకోవాలనుకున్నాడు.
ఒకసారి విద్యాప్రకాశానందగిరి స్వామి ‘శాశ్వత ఆనందం లభించాలంటే ఏం చేయాలో మీకో కథ చెబుతాను... ఆంజనేయుణ్ణి ఆరాధించే ఒక వ్యక్తి తన భక్తికి చిహ్నంగా మారుతి బొమ్మను చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకోవాలనుకున్నాడు. అలా దైవ చిత్రాన్ని పదేపదే చూస్తుంటే మరింత తాదాత్మ్యం కలుగుతుందని భావించాడు. వెంటనే పచ్చబొట్టు వేసే మనిషిని పిలిపించాడు. నొప్పి కలుగు తుందా అనడిగితే పచ్చ పొడిచే సమయంలో కొద్దిగా నొప్పి ఉంటుంది, కాస్త ఓర్చుకుంటే చాలు- అంటూ పని ప్రారంభించాడతను. నిమిషం గడిచిందో లేదో భక్తుడు నొప్పికి తాళలేక మారుతిలో ఏ భాగం మొదలుపెట్టావని అడిగాడు. తోక అని బదులిచ్చాడతడు. తోక లేకున్నా పర్లేదు తక్కిన బొమ్మ వేయ మన్నాడు భక్తుడు. సరే అని పచ్చ వేస్తోంటే నొప్పితో మూలిగాడు. ‘మారుతి నడుము వేస్తున్నా కదలొద్దు’ అన్నాడతను. ‘నడుము లేకపోతే మారుతి కాదా? అది వద్దు కానీ తర్వాతి భాగం చూడు’ అన్నాడు బాధగా. ఇలా భక్తుడు పచ్చ పొడుస్తున్న వ్యక్తిని ప్రతిసారీ వద్దని వారిస్తూ తలభాగం చాలన్నాడు. చివరికి అదీ వద్దన్నాడు. నొప్పి తట్టుకోలేక ‘తల లేకుంటేనేం?’ అనేసి మారుతి బొమ్మను పొడిపించుకోకుండానే అతణ్ణి పంపేశాడు. శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఇంద్రియాలకు కలిగే తాత్కాలిక కష్టాలను భరించాలనేది ఇందులో ఉన్న సందేశం. ఆత్మ సుఖాన్ని ఆశించేవారు విషయ సుఖాలకు దూరంగా ఉండాలి’ అంటూ వివరించారు.
పద్మజ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ