ధ్యానం అంటే...
ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి రిషీవ్యాలీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ- ‘ధ్యానం అంటే పరిశీలన, అన్వేషణ, అప్రమత్తత, తానెవరో తెలుసుకోవడం. వేదాలూ ఉపనిషత్తుల సారమిదే. అయితే కొందరి వల్ల ధ్యానానికి అర్థాలు మారిపోయాయి.
ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి రిషీవ్యాలీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ- ‘ధ్యానం అంటే పరిశీలన, అన్వేషణ, అప్రమత్తత, తానెవరో తెలుసుకోవడం. వేదాలూ ఉపనిషత్తుల సారమిదే. అయితే కొందరి వల్ల ధ్యానానికి అర్థాలు మారిపోయాయి. ఇన్నిసార్లు, ఇన్ని నిమిషాలు చేయాలంటూ ధ్యానం కట్టుబడి ఉండదు. పరిపూర్ణ మౌనమే ధ్యానం. దానికి స్థలం, కాలం, సమయ సందర్భాలతో పనిలేదు. మన ప్రమేయం లేకుండా మనసు ధ్యానమగ్న మైతే అది నిజమైన ధ్యానం. ఇలాంటి ధ్యానంలో ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి. కానీ వాటికి ఆదేశాలను జారీచేసే మనసు మూగ, గుడ్డి, చెవిటిది అయిపోతుంది. దాంతో మెదడు మహా ప్రశాంతతను అనుభవిస్తుంది. ఇదే సమాధి స్థితి. ధ్యానం చేసేముందు ఒకసారి పరిసరాలను, అందులోని అంశాలను నిశితంగా పరిశీలించి కళ్లు మూసుకోవాలి. బయట చూసిన వాటిని మనోనేత్రంతో చూసేందుకు సాధన చేయండి. కళ్లతో చూసిన వాటిని మనసు తీక్షణంగా పరిశీలిస్తుందని, బయట ఉన్నదే లోపలా ఉందని గ్రహిస్తారు. ఇలా జ్ఞాననేత్రాన్ని తెరిపించగలిగితే పరిపూర్ణ ధ్యానం. అంతేతప్ప ధ్యానం చేయాల్సింది కాంక్షలను నెరవేర్చుకోవడానికి కాదు. ముందు మనం ఎవరిమో అర్థమైతే.. ఆనక దైవాన్ని తెలుసుకోగలం’ అంటూ వివరించారు.
పద్మజ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
MiG 21: 2025 నాటికి మిగ్-21 యుద్ధ విమానాల సేవలు నిలిపేస్తాం: ఎయిర్ చీఫ్ మార్షల్
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం