నిజమైన దానం
రమణమహర్షిని దర్శించేందుకు వచ్చిన ఓ ధనికుడు, తాను రాబోయే నెలలో ఫలానా రోజున అన్నదానం చేస్తానని మాటల సందర్భంలో చెప్పాడు.
రమణమహర్షిని దర్శించేందుకు వచ్చిన ఓ ధనికుడు, తాను రాబోయే నెలలో ఫలానా రోజున అన్నదానం చేస్తానని మాటల సందర్భంలో చెప్పాడు. అందుకు రమణులు ‘ఈ ప్రాంతంలో ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు. నువ్వు చేయాలనుకున్న అన్నదాన మేదో రేపే చేయొచ్చుకదా! ఎప్పటికో వాయిదా వేయడం ఎందుకు?’ అనడిగారు. ‘జ్యోతిష్యులు ఆరోజు దానం చేస్తే మంచిదని చెప్పారు’ అన్నాడతను. రమణులు నవ్వి, ‘అవసరం ఉన్నప్పుడు ఇస్తే ఉపయోగం ఉంటుంది, తృప్తిచెందుతారు. దానం నీ స్వార్థం కోసం, పొగడ్తలు, ప్రశంసల కోసం చేయకూడదు. అందులో గోప్యత కూడా ఉండాలి. ఇచ్చిన సంగతి దాత మర్చిపోవాలి, గ్రహీత గుర్తుంచుకోవాలి. చేసే దానం ఇతరులకు ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉండాలి. మిగిలి పోయిందీ, చెడిపోయిందీ దానమే కాదు. తనకు పదిమందికి అన్నదానం చేయాలని కోరికగా ఉంది. కానీ స్తోమత లేదు- అంటూ ఓ నిరుపేద భక్తుడు కంచి పరమాచార్య వద్ద వాపోయాడు. స్వామి వారు అతణ్ణి ఊరడిస్తూ ‘అంత స్తోమత లేనివారు పశు పక్ష్యాదులు, చీమలు, కుక్కలు లాంటి జీవరాశులకు ఆహారం అందించినా సమఫలితాన్ని ఇస్తుంది. మొక్కలకు నీళ్లు పోసి కూడా సంతృప్తి చెంద వచ్చు’ అంటూ ఉపదేశించారు. కనుక ఉన్నంతలో ఉదారంగా దానం చేయాలి. భూరి విరాళం ఇవ్వగల శ్రీమంతులు, లోభత్వంతో చాలీచాలని అల్పదానాలు చేసినా ఫలితం రాదు’ అంటూ వివరంగా చెప్పారు.
పరాశరం సచ్చిదానంద మూర్తి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!