మంగళ శుక్రవారాల్లో ధనం ఇవ్వొచ్చా?

మంగళవారం కుజుడికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. అందువల్ల భూమిపై నివసించే మనందరి మీదా కుజ ప్రభావం ఉంటుంది.

Published : 11 May 2023 00:37 IST

మంగళవారం కుజుడికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. అందువల్ల భూమిపై నివసించే మనందరి మీదా కుజ ప్రభావం ఉంటుంది. కుజుడు కలహకారకుడు. అందుకే మంగళవారం నాడు శుభకార్యాలు ఏవీ తలపెట్టరు. ఆ రోజు ఎవరికైనా ధనం ఇచ్చినట్లైతే అది తిరిగి రాకపోగా గొడవలకు దారితీస్తుంది అంటారు. ఇక శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన వారం. అందుకే ఆ రోజు కూడా సొమ్ము ఇవ్వరు. ఈ నమ్మకాలతోనే మంగళ, శుక్ర వారాల్లో ఎవరికీ అప్పు ఇవ్వరు, దానం చేయరు. ఆఖరికి తాము తీసుకున్న రుణాన్ని కూడా ఆ రోజుల్లో తీర్చడానికి భయపడతారు. ధనాన్ని అదుపు చేయడానికి ఈ నమ్మకం ఉపయోగపడుతుంది అని కొందరంటే.. ‘ఆపదలో ఉన్నవారికి ధనసాయం చేయకపోతే ఎలా? దానివల్ల మేలు సంగతి అటుంచి కీడు ఒనగూరుతుంది’ అంటూ మానవతను ప్రబోధించేవారూ కొందరున్నారు.

మొల్లూరు అంజనా తమన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని