అదీ రహస్యం

ఓ శిష్యుడు ‘గురువర్యా! బ్రహ్మమొక్కటే అనడంలో ఆంతర్యం ఏమిటి?’ అనడిగాడు. దానికి రమణమహర్షి ‘మట్టి కారణం అయితే దాన్నుంచి వచ్చే కుండ కార్యం.

Published : 08 Jun 2023 00:06 IST

ఓ శిష్యుడు ‘గురువర్యా! బ్రహ్మమొక్కటే అనడంలో ఆంతర్యం ఏమిటి?’ అనడిగాడు. దానికి రమణమహర్షి ‘మట్టి కారణం అయితే దాన్నుంచి వచ్చే కుండ కార్యం. కారణం లేకుండా కార్యం సంభవం కాదు. అలాగే చూపు కారణం అయితే దృశ్యం కార్యం. ఏ దృశ్యం లేకున్నా దృక్కు అనేది సత్యం. కానీ కారణమైన దృష్టికి.. కార్యమైన దృశ్యం లేకుంటే దానికి అర్థం ఉండదు. అందుకే ఈశ్వరుడు తన దేహాన్ని విభిన్న రూపాలతో జగతిని నింపాడు. అంటే ఇక్కడ దృక్కు అనే సత్యరూపానికి ఈశ్వరుడు కారణం కాగా, ఆయన భిన్న రూపాలను కార్యంగా చెప్పారు. అందుకే సృష్టికి పూర్వం నుంచి దృక్కు అంటే ఈశ్వరుడు తప్ప మరే దృశ్యం లేదన్నారు. ఈ దృక్కులే చైతన్యం. వెలుగు ఉంటే కానీ కంటికి వస్తువు కనిపించనట్లుగా ఈ చైతన్య శక్తి అనే దృక్కు లేకపోతే మనం దృశ్యమయ మైన ప్రపంచాన్ని చూడలేం. అంటే దృక్కు లేకుంటే దృశ్యం లేదు. ఈ చైతన్యం వల్లనే మనకి ఉనికి. జ్ఞానేంద్రియాల పనులన్నీ దృక్కులే. కన్ను చూస్తే, చెవి వింటుంది, నాలుక రుచిని చూస్తోంది. చర్మం స్పర్శానుభూతిని పొందుతోంది. ముక్కు వాసన గ్రహిస్తోంది. వీటన్నిటినీ సంపూర్ణంగా అనుభూతి చెందేది మనలోని చైతన్యం. అంటే కార్యాలు వేరైనా కారణం ఒక్కటే. అదే చైతన్య రూప ఈశ్వరుడు. అంటే ఏక రూప కారణ మైన దృక్కును ప్రసాదించేవాడు. అందుకే బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే.. అన్నాడు అన్నమయ్య’ అంటూ వివరించారు.

లక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని