గాంధీజీ రామభక్తుడెలా అయ్యాడు?

మహాత్ముడికి చిన్నతనంలో దొంగలన్నా, దయ్యాలన్నా మహా భయం. చీకటి పడిందంటే చాలు గడప దాటేవాడు కాదు. ఎవరెంత ధైర్యం చెప్పినా ఆయన మాత్రం గదిలోంచి బయటకు వచ్చేవాడు కాదు.

Published : 06 Jul 2023 00:37 IST

హాత్ముడికి చిన్నతనంలో దొంగలన్నా, దయ్యాలన్నా మహా భయం. చీకటి పడిందంటే చాలు గడప దాటేవాడు కాదు. ఎవరెంత ధైర్యం చెప్పినా ఆయన మాత్రం గదిలోంచి బయటకు వచ్చేవాడు కాదు. ఇలాంటి సమయంలో వాళ్లింట్లో పనిచేసే రంభ అనే పనిమనిషి ఆ భయం నుంచి బయటపడే ఉపాయం చెప్పింది. అదే రామమంత్రం. భూతప్రేతాలకే కాదు సర్వ భయాలకూ రామనామ స్మరణమే ఔషధమని సూచించింది. ఆ మాటలు ఆయన మనసులో నాటుకోవడంతో రామనామాన్ని జపించేవారు. ఆయన పినతండ్రి కుమారుడు రామభక్తుడు. అతడు గాంధీజీకి పదమూడేళ్ల వయసులో రామరక్షా స్తోత్రం నేర్పాడు. ఇక ఉదయం స్నానం చేయగానే దాన్ని పారాయణం చేయసాగాడు. దీనికి తోడు ఆయన పోరుబందరులో ఉన్నప్పుడు అక్కడి రామాలయంలో రోజూ రాత్రిపూట రామాయణ పారాయణం జరిగేది. ‘భాగవతోత్తముడైన లాఘా మహారాజ్‌ గుజరాతీలో రామాయణాన్ని వినిపించేవారు. భక్తిపారవశ్యంతో జాలువారే ఆ రామకథ వింటూ పరవశించేవాణ్ణి. భగవంతుని నామం నిరాశా నిస్పృహలను తొలగిస్తుంది. రామనామ స్మరణతో ఓ దివ్యశక్తి నాపై ప్రసరించింది. దుర్బలులకు రామనామమే బలం. పెదాలతో పలకటం కాదు, అది హృదయంలోంచి రావాలి’ అంటూ గాంధీజీ చెప్పారోసారి.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని