అధికమాసం విశేషమేమిటి?

ఈ నెల 18న శ్రావణ అధికమాసం రాబోతోంది. ఒకే సంవత్సరంలో ఒకే పేరున్న రెండు మాసాలు వచ్చినట్లైతే మొదటిదాన్ని అధికం, రెండోదాన్ని శుద్ధం అంటారు. అధికమాసంలో ఏయే కార్యాలు నిర్వహించవచ్చో రుషులు వివరించారు..

Published : 13 Jul 2023 02:03 IST

ఈ నెల 18న శ్రావణ అధికమాసం రాబోతోంది. ఒకే సంవత్సరంలో ఒకే పేరున్న రెండు మాసాలు వచ్చినట్లైతే మొదటిదాన్ని అధికం, రెండోదాన్ని శుద్ధం అంటారు. అధికమాసంలో ఏయే కార్యాలు నిర్వహించవచ్చో రుషులు వివరించారు..

శ్రౌత స్మార్త క్రియాస్సర్వా ద్వాదశే మాసి కీర్తితాః
త్రయోదశేతు సర్వాస్తాః నిష్ఫలా ఇతి కీర్తితాః  

అంటోంది శాస్త్రం. శ్రౌత స్మార్తాది కర్మలన్నీ శుద్ధ (నిజ) మాసంలో ఆచరించాలి. అధికమాసంలో ఆచరిస్తే నిష్ఫలమౌతాయని భావం. దేవ కార్యాలు శుద్ధ మాసంలో, పితృకార్యాలు రెండింటిలోనూ చేయవచ్చు. అయితే అధిక మాసంలో పిండ రహితంగా, శుద్ధమాసంలో పిండ సహితంగా చేయాలి. అధిక మాసంలో సత్యనారాయణ వ్రతం, అభిషేకాలు, నవగ్రహ హోమాలు, శాంతి పూజలు నిరభ్యంతరంగా చేయొచ్చు. మాసమంతా విరామం లేకుండా ఒక దీపం నిరంతరం వెలిగించాలి. అధికమాసంలో ఫలదానాలు చేసినా, పిండివంటలు పంచిపెట్టినా ఎక్కువ ఫలితాన్నిస్తాయి. ఈ దానాలు శుక్ల ద్వాదశి, పౌర్ణమి, కృష్ణాష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య రోజుల్లో చేసినట్లైతే విశేష ఫలితాలు పొంది సుఖ శాంతులతో ఉంటారు.

పులిగండ్ల చిదంబరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని