అత్యంత విలువైంది!

చైనాలో సూజెన్‌ అనే జెన్‌ గురువును ఒక శిష్యుడు ‘గురువర్యా! ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏది?’ అనడిగాడు.

Published : 10 Aug 2023 00:16 IST

చైనాలో సూజెన్‌ అనే జెన్‌ గురువును ఒక శిష్యుడు ‘గురువర్యా! ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏది?’ అనడిగాడు.

శిష్యుణ్ణి దీర్ఘంగా చూసి ‘చనిపోయిన ఎలుక తల’ అంటూ బదులిచ్చాడు గురువు.

‘అదేంటి? చనిపోయిన ఎలుక తల విలువైందా? ఎట్లా?’ ఆశ్చర్యంగా అడిగాడు శిష్యుడు.

గురువు నవ్వి ‘దాని విలువ కట్టినవాడు ఈ ప్రపంచంలో ఇంతవరకు లేడు మరి. కనుక అది విలువైందే కదా’ అన్నాడు.

లోకంలో మనుషులు అవసరం లేని విషయాలకి విలువ ఇస్తూ సమయాన్ని వృథా చేస్తూనే ఉన్నారు. కరిగిపోతున్న కాలం కంటే విలువైంది ఇంకేమీ లేదు. అంత అమూల్యమైన కాలాన్ని తమకోసం ఉపయోగించుకోవటం మాని వ్యర్థమైన వాటికి ప్రాముఖ్యత ఇవ్వడం ఎంతవరకు సబబు? కాలగర్భంలోకి జారిపోతే ఎప్పటికీ వెనక్కి రాని ప్రస్తుత క్షణాలని అపురూపంగా అనుభవంలోకి తీసుకోవటం ముఖ్యం. అందువల్ల లోకంలో చాలా విలువైంది కాలం మాత్రమే అన్నది సారాంశం.

చేబ్రోలు అరుణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని