మనం ఓడినా గెలిచినట్లే

నిజమైన క్రైస్తవుడిగా జీవించడం అంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ‘నన్ను అనుసరించేవాడు తనను తాను ఉపేక్షించుకుని తన సిలువతో రావాలి’ (లూకా 9:23) అన్నది ప్రభువు వాక్యం.

Published : 10 Aug 2023 00:26 IST

నిజమైన క్రైస్తవుడిగా జీవించడం అంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ‘నన్ను అనుసరించేవాడు తనను తాను ఉపేక్షించుకుని తన సిలువతో రావాలి’ (లూకా 9:23) అన్నది ప్రభువు వాక్యం. తనను తాను ఉపేక్షించు కోవడం అంటే జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. చెడు చేయకు, చూడకు, మాట్లాడకు అనే నియమాన్ని చిత్తశుద్ధితో ఆచరించాలి.

మానవాళికి మోక్షం ప్రసాదించేందుకు ఏసు సిలువలో భయంకర హింస అనుభవించాడు. కొరడాలతో కొట్టారు, తలపై ముళ్ల కిరీటం పెట్టారు, ముఖంపై ఉమ్మివేశారు. అవమానకరమైన మాటలతో దూషించారు. ఆ దుర్భర హింసను సహించాడు, భరించాడు. అలా ఆయన మన కోసం తన రక్తం చిందించాడు. కొసమెరుపు ఏమంటే ‘తండ్రీ! తామేం చేస్తున్నారో తెలియని వీరిని క్షమించు’ అని దేవుణ్ణి ప్రార్థించాడు. పాపపంకిలంలో ఉన్న మనల్ని నిత్యాగ్ని గుండంలో పడకుండా రక్షించి, మోక్షానికి తీసుకెళ్లడానికే ఏసు అంత శ్రమించాడు. ఆయన ప్రేమ పరలోక దేవుని ప్రతిఫలం ఆశించని ప్రేమ. కనుక మనం ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి. మనను హింసించిన వారిని కూడా తిరిగి బాధపెట్టక మన సిలువనెత్తుకుని ప్రభువును అనుసరిద్దాం. అప్పుడు లోకం దృష్టిలో ఓడినా మనం గెలిచినట్లే.

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని