గరుడ పురాణం చదువుకోవచ్చా?

అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. ఇందులో మరణించిన వ్యక్తి ....

Published : 12 Apr 2018 02:11 IST

ధర్మసందేహం
గరుడ పురాణం చదువుకోవచ్చా?

గరుడ పురాణం ఎవరైనా కాలం చేసినపుడే చదవాలనీ, వినాలనీ అంటారు. మిగతా సమయాల్లో దీనిని చదవకూడదా?

- కమలశ్రీ, ఒంగోలు

ష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. ఇందులో మరణించిన వ్యక్తి ఆత్మ ఊర్ద్వలోకాలకు చేసే ప్రయాణం గురించిన వివరాలు ఉన్నాయి.  ఇంటిలో ఎవరైనా మరణించిన సందర్భంలో దీనిని చదివినా, విన్నా.. మరణించిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని ఒక విశ్వాసం.  మృతుని కుటుంబానికి శుభాలు కలుగుతాయని చెబుతారు. గరుడ పురాణంలో కేవలం నరకంలో విధించే శిక్షల గురించి మాత్రమే చెప్పారనుకుంటే పొరపాటు. అంత్యకాలంలో చేయవలసిన దానాలు, మరణించిన వారికి చేయాల్సిన ఉత్తర క్రియలు, మాతృగర్భంలో జీవుడు పడే వేదన ఇలాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇందులో. ఈ పురాణాన్ని ఇంట్లో ఎవరైనా మరణించినపుడు మినహా మిగతా సమయాల్లో చదవరాదని కానీ, చదివితే దోషం వస్తుందని కానీ ఎక్కడా లేదు. అలా అనుకోవడం మానసిక బలహీనత తప్ప శాస్త్రీయం కాదు. గరుడ పురాణాన్ని ఎప్పుడైనా చదువుకోవచ్చు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని