ఏడాది దాటితే దోషమా?

శంకుస్థాపన తర్వాత ఏడాదిలోపు ఇంటి నిర్మాణం పూర్తిచేసి, గృహప్రవేశం చేయాలంటారు. అలా చేయలేకపోతే ఏమైనా ప్రమాదమా?

Published : 19 Apr 2018 01:33 IST

ధర్మ సందేహం
ఏడాది దాటితే దోషమా?

* శంకుస్థాపన తర్వాత ఏడాదిలోపు ఇంటి నిర్మాణం పూర్తిచేసి, గృహప్రవేశం చేయాలంటారు. అలా చేయలేకపోతే ఏమైనా ప్రమాదమా?

- శ్రీమణి, వరంగల్‌

శంకుస్థాపన చేసిన తర్వాత ఆ సంవత్సరంలోనే నిర్మాణం పూర్తి చేసి, గృహప్రవేశం చేయాలని చెబుతుంటారు. ఇందులోని ఆంతర్యం ఏమంటే.. శంకుస్థాపన చేసిన ముహూర్త ప్రభావం గృహనిర్మాణంపై ప్రసరించి త్వరితగతిన పూర్తవుతుందని మాత్రమే. ఒకవేళ అలాకాని పక్షంలో దోష పరిహారం కోసం శాస్త్ర నిపుణులు సూచించిన ప్రక్రియ చేసుకొని.. నిర్మాణం కొనసాగించవచ్చు. ఆలస్యం కావడం వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు