మనసు సమర్పించడమే..

మన సంప్రదాయంలో షోడశోపచార పూజా విధానం ఉంది. 16 ఉపచారాల్లో నైవేద్యం ఒకటి. అయితే ఈ దేవుడికి ఈ పదార్థం ఇష్టమనీ, అదే నివేదన చేయాలనీ నియమం ఏంలేదు.....

Updated : 09 Dec 2022 14:03 IST

ధర్మ సందేహం

దేవుడికి నివేదన ఎందుకు చేస్తాము?

- మనోరమ, బెంగళూరు

న సంప్రదాయంలో షోడశోపచార పూజా విధానం ఉంది. 16 ఉపచారాల్లో నైవేద్యం ఒకటి. అయితే ఈ దేవుడికి ఈ పదార్థం ఇష్టమనీ, అదే నివేదన చేయాలనీ నియమం ఏంలేదు. భక్తులు, భగవంతునిపై ప్రీతితో ఇలా అలవాటు చేసుకున్నారు. అది ఆచారంగా స్థిరపడింది. ‘నివేదన’ అంటే సమర్పించడం కాదు. తెలియజేయడం.. దైవానుగ్రహంతో మనం సంపాదించుకున్న ఆహారాన్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి చూపించడం నివేదన. ‘స్వామీ! నీ అనుగ్రహంతో నేనూ, నా కుటుంబం ఈనాడు ఆహారాన్ని పొందగలుగుతున్నా’మని కృతజ్ఞత తెలియజేయడమే నివేదన. మన ఇంటికి వచ్చిన అతిథికి పదార్థాలను పళ్లెంలో పెట్టి, అందిస్తే. అ అతిథి పదార్థం స్వీకరించి పళ్లెం వదిలేస్తాడు. దైవం మన మనసును స్వీకరించి పదార్థాలను మనకు ప్రసాదంగా ఇస్తున్నాడు. కనుక నివేదనలో మనసే ముఖ్యం కానీ పదార్థం కాదు. మనసును సమర్పించడమే ‘నివేదన’లోని ఆంతర్యం.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు