జ్యేష్ఠులకిప్పుడు పెళ్లి కూడదా?
వధువు, వరుడు జ్యేష్ఠ సంతానం (ఇంట మొదట పుట్టిన వారు) అయితే, వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం తగదు. దీనినే త్రిజ్యేష్ఠం అంటారు. సాధారణంగా భార్యాభర్తల....
ధర్మ సందేహం
జ్యేష్ఠులకిప్పుడు పెళ్లి కూడదా?
జ్యేష్ఠమాసంలో ఇంట్లో పెద్దపిల్లల పెళ్లి చేయకూడదు అంటారు ఎందుకు?
వధువు, వరుడు జ్యేష్ఠ సంతానం (ఇంట మొదట పుట్టిన వారు) అయితే, వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం తగదు. దీనినే త్రిజ్యేష్ఠం అంటారు. సాధారణంగా భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి మనసే ప్రధానం. జ్యోతిష సంప్రదాయంలో చంద్రుడిని మనఃకారకుడిగా అభివర్ణించారు. వివాహ ముహూర్త నిర్ణయంలో చంద్రబలం తప్పనిసరిగా చూడాలని కూడా చెబుతారు. జ్యేష్ఠ మాసంలో.. పౌర్ణమి నాటి చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కూడి ఉంటాడు. వధూవరులిద్దరూ జ్యేష్ఠ సంతానమైతే... జ్యేష్ఠమాసంలో నిర్ణయించే ముహూర్తానికి చంద్రబలం చాలదని జ్యోతిశ్శాస్త్రజ్ఞుల అభిప్రాయం. అందుకే జ్యేష్ఠ మాసంలో ఇంట్లో జ్యేష్ఠుల వివాహం అంత ప్రశస్త్యం కాదని నిర్ణయించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ