భూగోళానికి నిదర్శనం..

మన సంప్రదాయంలో గుమ్మడికాయను మహాలక్ష్మిగా భావిస్తారు. గుమ్మడికాయ.....

Published : 28 Jun 2018 02:10 IST

ధర్మసందేహం
భూగోళానికి నిదర్శనం..

ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ ఎందుకు కడతారు?

- ప్రసాద్‌, తిరుపతి

మన సంప్రదాయంలో గుమ్మడికాయను మహాలక్ష్మిగా భావిస్తారు. గుమ్మడికాయ శుభానికి సంకేతం. అంతేకాక ఇది దృష్టి దోషాలను పరిహరిస్తుందన్న విశ్వాసం పరంపరాగతంగా మనలో స్థిరపడింది. అంతేకాదు ఆకారాన్ని బట్టి గుమ్మడి కాయను భూగోళానికి ప్రతీకగా కూడా కొందరు భావిస్తారు. దృష్టి దోషాన్ని పరిహరిస్తుందనీ, అశుభాన్ని తొలగించి శుభాలను ప్రసాదించే తత్వం గుమ్మడికాయలో ఉందని అనాదిగా ఉన్న నమ్మకం. ఈ కారణాలే గుమ్మడిని పూజార్హంగా నిలబెట్టాయి. ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టే సంప్రదాయం స్థిరపడింది.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని