తపస్సుతో రాలేదు!

రావణుడికి పదితలలు పుట్టుకతో వచ్చినవి కావు. వరప్రసాదంగా లభించినవి కావు. కామరూప విద్యతో పది తలలు ఏర్పడ్డాయి. అలా పది తలలు వచ్చినప్పుడు.. ఇరవై చేతులూ వస్తాయి. సర్వసాధారణంగా యుద్ధరంగంలో శత్రువులకు భయం...

Published : 05 Jul 2018 02:35 IST

ధర్మ సందేహం
తపస్సుతో రాలేదు!

రావణుడికి పది తలలు ఎలా వచ్చాయి?
రావణుడికి పదితలలు పుట్టుకతో వచ్చినవి కావు. వరప్రసాదంగా లభించినవి కావు. కామరూప విద్యతో పది తలలు ఏర్పడ్డాయి. అలా పది తలలు వచ్చినప్పుడు.. ఇరవై చేతులూ వస్తాయి. సర్వసాధారణంగా యుద్ధరంగంలో శత్రువులకు భయం కలిగించడానికి రావణుడు ఈ పదితలలు, ఇరవై చేతుల రూపాన్ని ధరిస్తూ ఉండేవాడు. నిద్రించే సమయంలో, భార్యలతో కలిసి ఉన్న వేళలో.. ఒకే తల, రెండు చేతులతో ఉండేవాడు. ఈ పదితలలూ ఆధ్యాత్మికంగా ఒక సంకేతం కూడా! మనస్సుకు లోబడి ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు మొత్తం పది ఇంద్రియాలు ఉంటాయి. ఈ పదింటినీ అదుపులో పెట్టుకోవడం ఆధ్యాత్మిక సాధనకు బలమవుతుంది. వీటికి లొంగిపోవడం లౌకిక బంధాలకు కారణం. పది ఇంద్రియాలకు లొంగిపోయినవాడే రావణుడు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని