ధర్మసందేహం

‘‘సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా..’’ అనే శ్లోకాన్ని బట్టి దీపంలో మూడు వత్తులు వేయాలి. మన చుట్టూ ఉన్న చీకటిని, మనలోని చీకటిని తొలగించుకోవడమే...

Published : 19 Jul 2018 01:38 IST

ధర్మసందేహం

దీపారాధన ప్రాధాన్యాన్ని తెలియజేయండి?

- మాధవి, రాజమండ్రి  

‘‘సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా..’’ అనే శ్లోకాన్ని బట్టి దీపంలో మూడు వత్తులు వేయాలి. మన చుట్టూ ఉన్న చీకటిని, మనలోని చీకటిని తొలగించుకోవడమే దీపారాధన లక్ష్యం. సత్త్వ, రజో, తమో గుణాల సమ్మేళనమే మానవుడి మనస్సు. అజ్ఞానమనే చీకటికి మూడు కోణాలివి. వీటిని వీడినప్పుడే దైవారాధనకు అర్హత లభిస్తుంది. ఈ మూడు చీకట్లను తొలగించుకోవడానికి గుర్తుగా మూడువత్తులతో దీపారాధన చేయాలన్నారు పెద్దలు. పూజలో ఒక వత్తి దీపం వెలిగించరు. మృతదేహం తల దగ్గర ఉంచే దీపాన్ని ఒకే వత్తితో వెలిగిస్తారు. ఆ కారణంగా దైవ దీపారాధనలో ఒక వత్తి వేయకూడదంటారు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని