ధర్మ సందేహం

ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మారింది. ఆషాఢం గ్రీష్మ, వర్ష రుతువుల సంధికాలంలో వస్తుంది...

Published : 26 Jul 2018 01:50 IST

ధర్మ సందేహం

ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?

- సుజాత, కామారెడ్డి  

ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మారింది. ఆషాఢం గ్రీష్మ, వర్ష రుతువుల సంధికాలంలో వస్తుంది. ఈ సమయంలో వాతావరణ ప్రభావం వల్ల అనేక సూక్ష్మక్రిములు వ్యాపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గాలిలో, నీటిలో వీటి తీవ్రత అధికం. వర్షాలతో ఇంటాబయటా తడిగా ఉంటుంది. ఇంటి పనుల్లో తరచూ నీటిని వినియోగించాల్సి వస్తుంటుంది. నీటితడి కారణంగా చేతులు, పాదాలు చెడే ప్రమాదం ఉంది. దీంతో సూక్ష్మక్రిముల ప్రభావం పెరుగుతుంది. చేతులు, పాదాల ద్వారా ఈ క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా గోరింటాకు రోగనిరోధకశక్తిగా పనిచేస్తుంది. అందాన్నిస్తూనే.. ఆరోగ్య సంబంధమైన ఒక రక్షాకవచంలా గోరింటాకు పనిచేస్తుంది.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని