లక్ష్మీదేవికి గణపతితో విరోధం

నాక్షతైహి అర్చయేత్‌ విష్ణుః నకేతక్యా శివం నతులస్యా గణాధిపం అని చెబుతోంది ధర్మ శాస్త్రం. దేవతా పూజలన్నీ ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించాల్సి....

Published : 02 Aug 2018 02:08 IST

ధర్మ సందేహం
లక్ష్మీదేవికి గణపతితో విరోధం

వినాయకుడికి తులసిదళం సమర్పించకూడదని అంటారు ఎందుకు?

గాయత్రి, హైదరాబాద్‌  

నాక్షతైహి అర్చయేత్‌ విష్ణుః నకేతక్యా శివం
నతులస్యా గణాధిపం అని చెబుతోంది ధర్మ శాస్త్రం. దేవతా పూజలన్నీ ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. విష్ణుమూర్తిని అక్షతలతో, పరమేశ్వరుణ్ని మొగలిపూలతో, వినాయకుడిని తులసిదళాలతో అర్చించరాదని ఆగమ శాస్త్రం చెబుతోంది. ప్రమథగణ అధ్యక్ష పదవి పొందిన వినాయకచవితి రోజు నిషేధాన్ని సడలించింది. మిగిలిన రోజుల్లో సమర్పించకూడదు. తులసి రూపంలో ఉన్న లక్ష్మీదేవికి, గణపతికి విరోధం ఏర్పడి శాపప్రతిశాపాలు ఇచ్చుకున్నారట. ఈ క్రమంలో వినాయకుడి పూజలో తులసి వినియోగించరాదని పురాణ కథనం.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని