నాగులకు పూజలెప్పుడు?
స్థానిక సంప్రదాయాలు, ఆచారాల్లో ఉండే భేదాల కారణంగా కొందరు......
సందర్భం
నాగులకు పూజలెప్పుడు?
ఈనెల 15 నాగుల పంచమి
స్థానిక సంప్రదాయాలు, ఆచారాల్లో ఉండే భేదాల కారణంగా కొందరు శ్రావణంలో, మరికొందరు కార్తీకమాసంలో సర్పారాధన చేస్తారు. కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కాగా, శ్రావణమాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపకుంటారు. కొన్నిచోట్ల శ్రావణ శుద్ధ చతుర్థి రోజున అంటే చవితి నుంచే నాగ పంచమి పూజకు సంబంధించిన విధానం మొదలుపెట్టాలని మరుసటి రోజు వరకు కొనసాగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టే కొన్ని ప్రాంతాల్లో దీన్ని నాగుల చవితి అని కూడా పిలుస్తారు
శ్రావణమాసం శుక్ల పంచమిని నాగపంచమి అంటారు. స్కంద పురాణంలో ఇందుకు సంబంధించిన విషయాలు విస్తారంగా ఉన్నాయి. పార్వతీదేవికి సాక్షాత్తు పరమేశ్వరుడు నాగపంచమి వైశిష్ట్యాన్ని వివరించినట్లు ఇందులో ఉంది. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతడిని ఏదైనా వరం కోరుకొమ్మని అడిగితే, తాము (సర్పజాతి) ఆవిర్భవించిన రోజున సృష్టిలోని మానవులంతా తమకు పూజ చేసేలా అనుగ్రహించమని అడిగాడు. విష్ణుమూర్తి అనుగ్రహించాడు. ఈ వరం కారణంగా శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకునే ఆచారం వ్యాప్తిలోకి వచ్చింది. బ్రహ్మదేవుడు ఆదిశేషుడిని అనుగ్రహించిన రోజు కూడా ఇదేనని కొన్ని చోట్ల ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ