చుక్కలన్నీ ఇంటిముందే
అషాఢ బహుళ అమావాస్యను ‘చుక్కల అమావాస్య’ అంటారు. ఈ రోజు...
ధర్మ సందేహం
చుక్కలన్నీ ఇంటిముందే
చుక్కల అమావాస్య అంటే ఏమిటి?
ఆ రోజు పాటించాల్సిన విధులేమిటి?
అషాఢ బహుళ అమావాస్యను ‘చుక్కల అమావాస్య’ అంటారు. ఈ రోజు గౌరీపూజ చేస్తారు. రానున్న శ్రావణ మాసం పెళ్లిళ్లకు ప్రశస్తి. ఆషాఢ అమావాస్య నాడు కన్నెపిల్లలు తమకు మంచి వరుడు రావాలని కోరుతూ గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి, పూజించి.. రక్షాకంకణం ధరిస్తారు. బియ్యపుపిండితో చేసిన వంటకాలను అమ్మవారికి నివేదన చేస్తారు.
పెళ్లయిన ఆడవాళ్లు అయిదోతనాన్ని కోరుతూ గౌరీ నోము చేస్తారు. వంద చుక్కలతో ముగ్గుపెట్టి.. ఆ చుక్కలపై దారపు పోగులు ఉంచి వ్రతం ఆచరిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఆ పోగులన్నీ కలిపి మెడలో ధరిస్తారు. సంపన్న మహిళలు ముగ్గులో బంగారు చుక్కలు అమర్చి, పూజించి మర్నాడు ఆ బంగారాన్ని ముత్తయిదువులకు దానమిస్తారు. చుక్కల ముగ్గులో దీపాలు అలంకరించి పూజిస్తారు.
కన్నడ ప్రాంతీయులు ఈ అమావాస్య నాడు ‘జ్యోతిర్భీమేశ్వర వ్రతం’, ‘సతీసంజీవనీ వ్రతం’, ‘గుండన వ్రతం’ అనే పేర్లతో పార్వతీపరమేశ్వరులను అర్చిస్తారు. తమిళనాడులో ‘ఆడి అమావాస్య’ అనే పేరుతో జరుపుకొంటారు. కేరళలో ‘కర్కిడక అమావాస్య’ అని, మహారాష్ట్రలో ‘గటారి అమావాస్య’ అని, గుజరాత్‌లో ‘దివాసో’ అని ఇలా పలు ప్రాంతాల్లో పలు పేర్లతో చుక్కల అమావాస్యను చేసుకుంటారు. ఏ పేరుతో పిలిచినా ఈ రోజున గౌరీవ్రతం, దీపారాధన ఆచరిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ