ధర్మ సందేహం

భగవంతుడికి నివేదించే అన్నం, పాలల్లో చక్కెర వేయకూడదంటారు! ఇది నిజమేనా?

Published : 16 Aug 2018 01:44 IST

ధర్మ సందేహం

భగవంతుడికి నివేదించే అన్నం, పాలల్లో చక్కెర వేయకూడదంటారు! ఇది నిజమేనా?

పరమేశ్వర్‌, ఖమ్మం

దేవుడికి నివేదన చేసే అన్నంలో చక్కెర సాధారణంగా ఎవరూ వేయరు. కానీ, పాలలో చక్కెర వేయడం చూస్తుంటాం. అదేమీ దోషం కాదు. మనం ఏ ఆహారం స్వీకరిస్తామో.. అదే దైవానికి మనం నివేదన చేస్తాం. ఇందులో ఏ దోషమూ లేదు. ఎందుకంటే.. నివేదన అంటే తెలియజేయడం అని అర్థం. ‘స్వామీ! నీ అనుగ్రహంతో నేను, నా కుటుంబ సభ్యులు ఈ ఆహారాన్ని తీసుకుంటున్నాం’ అని భగవంతుడికి చేసే కృతజ్ఞతాభివందనమే మనం చేసే నివేదన.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని