వెలుగు నీవే!
ప్రతి మనిషీ శాశ్వతమైన దైవాంశమే అని గీతాచార్యుడు చెప్పాడు. ప్రతి వ్యక్తీ ఎలా....
గురుగోవిందం
వెలుగు నీవే!
ప్రతి మనిషీ శాశ్వతమైన దైవాంశమే అని గీతాచార్యుడు చెప్పాడు. ప్రతి వ్యక్తీ ఎలా ఆత్మ స్వరూపుడో జగద్గురువైన ఆది శంకరాచార్యులు ఒకసారి తన శిష్యునితో జరిగిన సంవాదంలో సహేతుకంగా నిరూపించారు.
గురువు: నీవు ఏ వెలుగు వల్ల పదార్ధాలను, ప్రాణులను గుర్తిస్తావు?
* శిష్యుడు: పగలు సూర్యకాంతి వల్ల, రాత్రి దీపకాంతి వల్ల.
గురువు: సూర్య, దీప కాంతులను గ్రహించడానికి నీకు ఏది వెలుగు?
* శిష్యుడు: నా కళ్లు
గురువు: కళ్లు మూసుకుంటే (స్వప్నావస్థలో) నీకు ఏది వెలుగు ?
* శిష్యుడు: బుద్ధి
గురువు: ఆ బుద్ధి కూడా లేనట్టి గాఢ నిద్ర(సుషుప్తి)లో నీకు ఏది వెలుగు?
* శిష్యుడు: అప్పుడు నేనే వెలుగు రూపుణ్ణి
గురువు: కాబట్టి నీవే ప్రకాశ రూపుడివి, ఆత్మ స్వరూపుడివని తెలుసుకో ఇదే తత్త్వమసి... అతడు నీవే అనే మహా వాక్య బోధ
* శిష్యుడు: అవును ప్రభో! నేనే ఆ ప్రకాశ రూపుడైన ఆత్మను... అహం బ్రహ్మాస్మి
ప్రతి వ్యక్తి ఆత్మ స్వరూపుడైనందున, సమస్త మానవాళి దైవ స్వరూపులే. నశించని అమృత పుత్రులే. మనుషులందరిలో ఉన్నది ఒకే బ్రహ్మ పదార్ధం అయినప్పుడు, అందరిలో పరమాత్మ సమంగా ఉన్నప్పుడు, యావత్ మానవ జాతి పారమార్ధిక దృష్టిలో సమానమేని గీతాచార్యుడి ఉవాచ.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ