ధర్మ సందేహం

మహిళలు నెలసరి సమయంలో ఆలయానికి వెళ్లడం, అర్చనల్లో...

Published : 30 Aug 2018 01:53 IST

ధర్మ సందేహం

నెలసరి సమయంలో దేవుడి పూజలు, వేదమంత్రాలు వినబడకూడదా?

మహాలక్ష్మి, హైదరాబాద్‌

మహిళలు నెలసరి సమయంలో ఆలయానికి వెళ్లడం, అర్చనల్లో పాల్గొనడం, నిత్యపూజ చేయడం తగదన్నది ఓ నమ్మకం.. అయితే, ఇతరులు చేసే పూజలు, మంత్రాలు వారి చెవిన పడొచ్చు. అలా వినబడితే దోషమని పెద్దలు చెప్పలేదు. అవి వారికి వినపడినవి తప్ప, వారుగా కావాలని విన్నవి కావు. కాకతాళీయంగా జరిగినది. ఇందులో వారి కర్తృత్వం లేదు. కనుక దోషం లేదని పెద్దలు చెప్పారు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

నెమలి పింఛం అందానికి ప్రతీక. పింఛాన్ని ధరించిన కృష్ణపరమాత్మ అందానికే అందంగా నిలిచేవాడు. సృష్టిలోని ప్రతి ప్రాణీ నాకు ఆత్మబంధువే అని చాటిచెప్పటానికే పింఛాన్ని ధరించాడు కానీ, పరమాత్మకు అందాల అలంకరణలు అవసరం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని