కృతజ్ఞత చెల్లిస్తే..

అల్లాహ్‌ మనిషికి అసంఖ్యాకమైన వరాలు ప్రసాదించారు. మనిషికి ఎన్నో రకాల మేలు చేసిన దైవానికి కనీసం కృతజ్ఞత అయినా చెల్లిస్తున్నాడా? పైగా ఎలాంటి చిన్న ఇబ్బంది ఎదురైనా దైవాన్ని నిందిస్తూ కృతఘ్నత ప్రదర్శిస్తాడు. తనకు అంతులేని బాధలు వచ్చాయనీ నిష్ఠూరాలాడతాడు. వాస్తవంగా కృతజ్ఞతలు అల్లాహ్‌కు ప్రీతిపాత్రం చేస్తాయి.

Updated : 29 Nov 2022 13:39 IST

ఇస్లాం సందేశం

ల్లాహ్‌ మనిషికి అసంఖ్యాకమైన వరాలు ప్రసాదించారు. మనిషికి ఎన్నో రకాల మేలు చేసిన దైవానికి కనీసం కృతజ్ఞత అయినా చెల్లిస్తున్నాడా? పైగా ఎలాంటి చిన్న ఇబ్బంది ఎదురైనా దైవాన్ని నిందిస్తూ కృతఘ్నత ప్రదర్శిస్తాడు. తనకు అంతులేని బాధలు వచ్చాయనీ నిష్ఠూరాలాడతాడు. వాస్తవంగా కృతజ్ఞతలు అల్లాహ్‌కు ప్రీతిపాత్రం చేస్తాయి. దైవ సాన్నిహిత్యానికి చేరువ చేస్తాయి. అందువల్లనే మానవ మహోపకారి అయిన అల్లాహ్‌ను స్తుతించాలని, కృతజ్ఞతలు చెల్లించాలని ప్రబోధించారు అంతిమ ప్రవక్త (స). దైవం ప్రసాదించిన వరాలను తలచుకుంటూ కృతజ్ఞతలు చెల్లించిన వ్యక్తికి తీర్పు దినాన అందరికంటే ముందుగా స్వర్గ ప్రవేశం లభిస్తుందని ప్రవక్త (స) సెలవిచ్చారు. కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తి ఎక్కడ ఉంటే.. అక్కడ శుభాలు వర్షిస్తాయంటారు ఆయన. శిక్ష నుంచి, ఆపద నుంచి రక్షణ పొందడానికి, అల్లాహ్‌ సామీప్యాన్ని పొందడానికి కృతజ్ఞత సాధనమవుతుంది.

ముహమ్మద్‌ లియాఖత్‌ ఉద్దీన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని