దాత గ్రహీత

శివధనుర్భంగ ఘట్టం పూర్తయ్యింది. జనకుడి ఆహ్వానం మేరకు దశరథ మహారాజు తన నలుగురు పుత్రులËతో కలిసి బయల్దేరాడు.

Updated : 09 Mar 2023 02:50 IST

శివధనుర్భంగ ఘట్టం పూర్తయ్యింది. జనకుడి ఆహ్వానం మేరకు దశరథ మహారాజు తన నలుగురు పుత్రులతో కలిసి బయల్దేరాడు. వివాహ శోభాయాత్ర అయ్యాక జనక సామ్రాజ్య ద్వారం వద్దకు వెళ్లారు. జనకుడు సాదరంగా స్వాగతం పలికాడు. దశరథుడు వంగి కాళ్లకు నమస్కరించగా.. జనకుడు ప్రేమగా ఆలింగనం చేసుకుని ‘మహారాజా! మీరు పెద్దవారు. పైగా వరుడి పక్షంవారు. నాకు పాదాభివందనం చేయడం ఏమిటి?’ అన్నాడు.దశరథుడు నవ్వి ‘మహారాజా! మీరు దాతలు. కన్యను దానం చేస్తున్నారు. నేను గ్రహీతను మాత్రమే. మీ కన్యను మా వంశాన్ని ఉద్ధరించే కోడలుగా చేసుకుంటున్నాం. అంతే గానీ నాకు మీలా దానమిచ్చే అదృష్టం లేదుగా. కనుక దాత, పరిగ్రహీతల్లో ఎవరు పెద్ద, ఎవరు గొప్ప అనేది మీరే చెప్పండి’ అన్నాడు.జనకుడు ఆనందబాష్పాలు రాలుస్తూ ‘కూతుళ్లు ఉన్న తండ్రులు అదృష్టవంతులు. మీవంటి మామగార్లు లభిస్తే ఆ కూతుళ్లు మహా భాగ్యవంతులు’ అన్నాడు. ఆడపిల్లలున్న తండ్రులు గొప్పవాళ్లు- అని దశరథుడంటే... మంచి మామగార్లు దొరకడమూ గొప్ప సంగతే అన్నాడు జనకుడు.

కె.వి.యస్‌.యస్‌. శారద


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని