తొలి దర్శనం  శ్రీవరాహస్వామి వారిదే

తిరుమలను ఆది వరాహక్షేత్రంగా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించి ఇక్కడే కొలువైనట్లు ప్రతీతి. విష్ణుమూర్తి వైకుంఠాన్ని వీడి శ్రీవేంకటేశ్వరుడిగా..

Published : 07 Nov 2021 15:19 IST

ఈనాడు-తిరుపతి: తిరుమలను ఆది వరాహక్షేత్రంగా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించి ఇక్కడే కొలువైనట్లు ప్రతీతి. విష్ణుమూర్తి వైకుంఠాన్ని వీడి శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించిన తర్వాత తిరుమల కొండపై ఉండేందుకు తనకు వంద అడుగుల స్థలాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీవరాహమూర్తిని కోరగా అందుకు ఆయన అంగీకరించి, ఆపై ప్రథమ దర్శనం, పూజలన్నీ తనకే జరగాలని సూచించారు. ఇందుకు శ్రీనివాసుడు సమ్మతించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే  భక్తులు ముందుగా శ్రీభూవరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని చూసి తరిస్తారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు