క్షేత్రపాలకుడు రుద్రుడు

తిరుమల పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు రుద్రుడు. ఆయన గుర్తుగా బలిపీఠానికి ఈశాన్యమూలన క్షేత్రపాలక శిల ఏర్పాటు చేశారు. పురాణ కాలంలో అర్చకులు గుడికి తాళం వేసిన తర్వాత వాటిని శిలపై పెట్టి వెళ్లేవారు.

Published : 07 Nov 2021 15:16 IST

తిరుమల పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు రుద్రుడు. ఆయన గుర్తుగా బలిపీఠానికి ఈశాన్యమూలన క్షేత్రపాలక శిల ఏర్పాటు చేశారు. పురాణ కాలంలో అర్చకులు గుడికి తాళం వేసిన తర్వాత వాటిని శిలపై పెట్టి వెళ్లేవారు. మళ్లీ తెల్లవారి తాళాలు తీసుకుని తలుపులు తెరిచేవారు. ఒకసారి దీని కింద పడి బాలుడు మరణించాడని, అందువల్లే ఆ శిలను గోగర్భ తీర్థానికి(పాండవ తీర్థం) తరలించినట్లు పండితులు చెబుతున్నారు. తరలించే సమయంలో ఉన్న చిన్న శిలనే ప్రస్తుతం ఉన్న క్షేత్రపాలక శిలగా చెబుతుంటారు. మహాశివరాత్రి పర్వదినాన అర్చకులు పాండవ తీర్థానికి వెళ్లి అక్కడ ఏకాదశ రుద్రంతో రుద్రునికి అభిషేకం చేస్తారు. ప్రస్తుతం ఉదయం అర్చకులు తాళాలను క్షేత్రపాలక శిలకు తాకించిన తర్వాతనే ఆలయంలోకి వెళ్తారు. రాత్రి ఏకాంత సేవ పూర్తయిన తర్వాత తిరిగి వెళ్తూ ఇదేవిధంగా తాకించి నమస్కరిస్తుంటారు.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని