భక్తులకు కనులారా శ్రీవారి దర్శనం 

కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాదీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నాం. కొయిళ్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా బ్రేక్‌ దర్శనాలు  నిలిపివేశాం...

Published : 07 Nov 2021 15:10 IST

తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి 

కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాదీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నాం. కొయిళ్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా బ్రేక్‌ దర్శనాలు  నిలిపివేశాం. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు యథాతథంగా శ్రీవారిని దర్శించుకోవచ్చు.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రోజుకు ఎనిమిది వేల మందికి అవకాశం కల్పించాం. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి కైంకర్యాలు అన్నీ ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతాయి. భక్తులు కొవిడ్‌ నిబంధనలు అనుసరించి దర్శనాలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో భక్తులకు ఏ విధంగా దర్శనాలు కల్పించాలనే అంశంపై ఇప్పటికే అధికారులు ప్రణాళిక రూపొందించారు. భక్తులు కనులారా స్వామిని దర్శించుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని