పరశురాముడు నిర్మించిన ఆలయం

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో చెరువు గట్టుపై రామలింగేశ్వరాలయం ఉంది.

Published : 22 Dec 2022 00:32 IST

ల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో చెరువు గట్టుపై రామలింగేశ్వరాలయం ఉంది. 12వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో పరశురాముడు కూడా కొలువై ఉన్నాడు.

స్థల పురాణాన్ని అనుసరించి కార్తవీర్యార్జునుడు పరివారంతో అడవికి వెళ్లాడు. వేట పూర్తయ్యాక జమదగ్ని ఆశ్రమాన్ని దర్శించాడు. మహర్షి ధేనువు సాయంతో సమస్త పరివారానికి షడ్రసోపేత విందు ఏర్పాటుచేశాడు.  ఆ మహాత్మ్యమున్న ధేనువును అడిగితే తిరస్కరించాడని జమదగ్నిని చంపి, ఆవును తీసుకెళ్తున్న కార్తవీర్యార్జునుణ్ణి పరశురాముడు అంతమొందించాడు. క్షత్రియ సంహారం వల్ల కలిగే పాపం అంటకుండా దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్టించి తపస్సు చేశాడు. ఇక్కడ నెలకొల్పిందే చివరి శివలింగమంటారు.

ఈ ప్రాంతంలో ఎంత తపస్సు చేసినా శివుడు కనికరించరించలేదన్న ఉక్రోషంతో శివలింగానికి తల ఆనించి కొట్టుకోవడంతో శివుడు ప్రత్యక్షమై ఇది పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతుంది, సదా భక్తులను అనుగ్రహిస్తాను- అన్నాడు.

ఇక్కడి రెండు కొండల మధ్యనున్న క్లిష్టమైన చిన్న దారి లోంచి వెళ్తే పెళ్లవుతుందని, సంతానం కలుగుతుందని నమ్ముతారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి నల్గొండకు బస్సులు, రైళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి బస్సు లేదా ఆటోలో నార్కట్‌పల్లి వెళ్లొచ్చు.

బొగ్గరపు వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు