ఎవరు దొంగలు?

ఆదిశంకరుల వారిని ‘గురువర్యా! దొంగలంటే ఎవరు?’ అనడిగాడో శిష్యుడు. ‘తన అవసరాలకు మించి కూడబెట్టేవారంతా దొంగ లేనని భాగవతం పేర్కొంది.

Published : 12 Jan 2023 00:14 IST

ఆదిశంకరుల వారిని ‘గురువర్యా! దొంగలంటే ఎవరు?’ అనడిగాడో శిష్యుడు. ‘తన అవసరాలకు మించి కూడబెట్టేవారంతా దొంగ లేనని భాగవతం పేర్కొంది. భగవద్గీత ఇంకో అడుగు ముందుకు వేసి మనిషి చేసే సత్కర్మలకు సంతోషించిన దేవతలు వారికి అనుకూలమైన భాగస్వామిని, సత్సంతానాన్ని, ధనాన్ని ప్రసాదిస్తారు. వీటిని తిరిగి భగవంతుడికి సమర్పించాలనే ధ్యాస లేకుండా స్వార్థ చింతన చేసేవారంతా దొంగలే అంది. సమర్పణ అంటే పుట్టిన పిల్లలకు తలనీలాలు ఇవ్వడం, భార్యకి మొదటి స్థానం ఇవ్వడం, ఆహారం దగ్గర్నుంచి తనకు ప్రాప్తించిన ప్రతిదాన్నీ ముందుగా దేవుడికి నివేదించడం లాంటి చిన్న పనులేనని గ్రహించాలి. నేను, నాది లాంటి అసత్యాలను నమ్మి, భ్రమల్లో జీవించే వారంతా దొంగలే అంది వివేకచూడామణి. వీళ్లు దేన్నీ తస్కరించకున్నా చోరత్వ పాపం సంక్రమిస్తుంది. తమలోని భగవంతుడనే గొప్ప నిధిని వదిలేసి అనేక రకాలైన దొంగతనాలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక వ్యాపార వీధిలో భక్తి, సమర్పణల ధనాన్ని వెచ్చించి సర్వాంతర్యామి నామస్మరణను కొనుగోలు చేసేవారికి పుణ్యం లభిస్తుంది. సమర్పణా బుద్ధి వల్ల సూక్ష్మంలో మోక్షంలా నలకంత చీమలు సులభంగా బెల్లం తింటుండగా ఏనుగు కష్టపడి చెరకును నమలాల్సి వస్తోంది. పైగా ఏనుగు అపవాదుల దుమ్మూధూళిని తలపై చల్లుకుంటుంది. కనుక ఇతరుల వస్తువులను దొంగిలించే వారితో బాటు సమర్పణ అనేది లోపించిన వారంతా దొంగలే’ అంటూ వివరంగా చెప్పారు ఆది శంకరులు.
ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని