పెద్దలకెందుకు నమస్కరించాలి?

పెద్దలు కనిపించినప్పుడు గౌరవ సూచకంగా నమస్కరించడం మన సంప్రదాయం. నిజానికి ఇవి కేవలం ఆచారాలు కాదు, ఆరోగ్యానికీ దోహదం చేస్తాయి.

Updated : 22 Dec 2022 11:37 IST

పెద్దలు కనిపించినప్పుడు గౌరవ సూచకంగా నమస్కరించడం మన సంప్రదాయం. నిజానికి ఇవి కేవలం ఆచారాలు కాదు, ఆరోగ్యానికీ దోహదం చేస్తాయి. నమస్కరించడం వల్ల శాస్త్రీయ ప్రయోజనాలున్నాయని ఇప్పటికే నిరూపితమయ్యాయి. మన శరీరం అనుకూల, ప్రతి కూల శక్తుల కలయికతో రూపొందింది. దేహానికి కుడివైపున అనుకూల శక్తి ఉంటే, ఎడమవైపున ప్రతి కూల శక్తి ఉంటుంది. మనం గౌరవ సూచనగా వినమ్రంగా వంగి పెద్దల పాదాలను తాకడం వల్ల రెండు వ్యతిరేక శక్తులు జతకూడతాయి. ఫలితంగా మానసిక ప్రశాంతత కలుగుతుంది. పెద్దల పాదాలను ప్రేమగా స్పృశించినప్పుడు వారి హృదయం నుంచి వచ్చే చైతన్య తరంగాలు మనపై ప్రభావం చూపి చురుగ్గా, ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. రక్తం సవ్యంగా ప్రసరిస్తుంది. రక్తపోటును నివారిస్తాయి. సర్వవిధాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అహంకారం అడుగంటిపోతుంది.

వివిధ భంగిమల్లో నమస్కారం

పాదాలకు నమస్కరించేందుకు వంగడం వల్ల నడుము, వెన్నెముకలకు వ్యాయామం చేసినట్లై చక్కగా సాగుతాయి. నడుము వంచి పెద్దల పాదాలను తాకడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. వినయపూర్వకంగా చేసే సాష్టాంగ నమస్కారం మరింత లాభదాయకమైంది. శరీరమంతా సాగదీతకు గురై ఒళ్లు నొప్పులు దూరమవుతాయి.

ప్రతాప వెంక సుబ్బరాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని