పుణ్యప్రదం తీర్థస్నానం

యజ్ఞం చేసిన వ్యక్తిని సోమయాజి అంటారు. తీర్థంలో స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది అన్నారు.

Published : 02 Feb 2023 00:30 IST

జ్ఞం చేసిన వ్యక్తిని సోమయాజి అంటారు. తీర్థంలో స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది అన్నారు. యజ్ఞం ప్రయాసతో కూడుకున్నది. కలియుగంలో అది అసాధ్యం కనుక ప్రత్యామ్నాయంగా ఈశ్వరుడు తీర్థం కల్పించాడు. అన్ని నదులూ తీర్థాలు కావు. నదీ తీరాన ఆలయముంటే అది తీర్థం. ఆ పుణ్య స్నానానికి యజ్ఞఫలం దక్కుతుందన్నది వేదవాక్కు. తీర్థయాత్ర చేసినవాళ్లు తీర్థంలో తప్పక స్నానం చేయాలి. తీర్థయాత్రలు చేసి ఇంటికి చేరుకున్నాక అడిగిన వారికి ఏయే ఆలయాలను దర్శించారు, స్థలపురాణం, అక్కడి మహాత్ముల విశేషాలు, చేసిన తీర్థస్నానాలు.. ఇలా యాత్రా విశేషాలను జ్ఞప్తికి తెచ్చుకుని తాదాత్మ్యంతో చెబితే ప్రాసంగికపుణ్యం లభిస్తుందంటారు.

ప్రతాప వెంకట సుబ్బారాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని