యజ్ఞయాగాలెందుకు?!

అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి దేవుళ్లను సంతృప్తి పరచడానికి అగ్నిహోత్రం ఏర్పాటుచేస్తారు. రాగి పాత్రలో లేదా కుండలో పిడకలు పేర్చి, కర్పూరం వేసి అగ్ని రాజేస్తారు.

Published : 16 Feb 2023 00:18 IST

గ్నిదేవుణ్ణి ఆవాహన చేసి దేవుళ్లను సంతృప్తి పరచడానికి అగ్నిహోత్రం ఏర్పాటుచేస్తారు. రాగి పాత్రలో లేదా కుండలో పిడకలు పేర్చి, కర్పూరం వేసి అగ్ని రాజేస్తారు. అగ్ని అనేది అధిష్ఠాన దేవత. హోత్రం అంటే హవిస్సు. అగ్నిలో భక్తి పూర్వకంగా, మంత్రసహితంగా ఆయా దేవుళ్లకు స్వాహా అంటూ జారవిడిచే పాలు, అన్నం, నెయ్యి, మూలికలు మొదలైనవి హవిస్సులు. యజ్ఞం విష్ణు స్వరూపం. దేవతలకూ, మనకూ సంధానం ఏర్పరచేది హోమం. దేవతలను హవిస్సులతో సంతృప్తిపరచి, ఆరోగ్యం, ఆయుష్షు, కీర్తి, సంతతి, శాంతి పొందాలనుకుంటారు. యజ్ఞాల వల్ల పర్యావరణం పరిశుభ్రమవుతుంది. వర్షాలు కురుస్తాయి. రోగనిర్మూలక మూలికలు వేసి మండించడం వల్ల వ్యాధులు దూరమవుతాయి. తద్వారా మనసు ప్రక్షాళితమై ప్రశాంతమవుతుంది. అత్యధిక సంఖ్యలో సాధువులు పాల్గొనే, అధిక ధనం ఖర్చయ్యే అతిరాత్ర యాగం, చండీయాగం లాంటి మహాయాగాలే కాకుండా అందరూ చేయదగిన కొన్ని సంప్రదాయ ప్రక్రియలూ ఉన్నాయి. నిత్యం ఇళ్లలో హోమం చేస్తే నిత్యాగ్నిహోత్రులంటారు. యాగాల్లో అశ్వమేధ, పుత్రకామేష్టి, రాజసూయ, సర్ప, విశ్వజిత్‌ యాగాలు ముఖ్యమైనవి. పెళ్లిలో నవదంపతులు అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడవటం, అగ్ని సాక్షిగా ఒక్కటవడం తెలిసిందే. గృహప్రవేశ సమయంలో జరిపే గణపతి హోమం శాంతి సౌఖ్యాలనిస్తుంది. యాగాలు, హోమాలతో సుఖశాంతులు లభిస్తాయన్నది మహర్షుల ఉవాచ.

ప్రతాప వెంకట సుబ్బారాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు