Airbus: ఎయిర్‌బస్ ఆధ్వర్యంలో డ్రోన్ పైలట్‌లో సర్టిఫికెట్ కోర్స్
డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని ఎయిర్‌బస్ నిర్వహించనుంది. జూన్ 26 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు ఈ తరగతులు ఉంటాయి.
ముంబయి: యూరప్‌కు చెందిన ఏవియేషన్ సంస్థ ఎయిర్‌బస్ (Airbus) భారత్‌లో డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కోర్సు అందిస్తోంది. మైక్రో, స్మాల్ కేటగిరీ డ్రోన్ల విభాగంలో ఈ శిక్షణ ఉంటుందని పేర్కొంది. ఐదు రోజుల సర్టిఫికెట్ కోర్సు బెంగళూరులోని ఎయిర్‌బస్ ట్రైనింగ్ సెంటర్లో జూన్ 26 నుంచి ప్రారంభం అవుతుందని ఓ ప్రకటనలో తెలపింది. డ్రోన్ పైలట్లు కావాలనుకునే వారికి కోర్సులో భాగంగా థియరీతో పాటు, ఫ్లయింగ్ పాఠాలు ఉంటాయని కంపెనీ తెలిపింది.
శిక్షణలో భాగంగా డీజీసీఏ ఆమోదించిన ఎయిర్‌బస్ ఇన్‌స్ట్రక్టర్ డ్రోన్‌రూల్స్, ఫ్లయిట్‌కు సంబంధించి ప్రాథమిక సూత్రాలు, ఏటీసీ విధానాలు, మెయింటెనెన్స్, ఆపరేషన్స్, ఎరోడైనమిక్స్ వంటి అంశాలపై థియరీ క్లాసులు బోధిస్తారు. విద్యార్థులకు సిములేటర్‌పై కూడా శిక్షణ ఇస్తారు. బెంగళూరులోని ఎయిర్‌బస్ కేంద్రంలో ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు. డ్రోన్లను కూడా ఎయిర్‌బస్సే సమకూరుస్తుంది. పదోతరగతి పూర్తి చేసి 18-65 ఏళ్లు అభ్యర్థులు ఈ కోర్సులో శిక్షణ పొందొచ్చు. భారత పాస్‌పోర్టు తప్పనిసరి. మరిన్ని వివరాలకు dronetraining.india@airbus.com మెయిల్ ఐడీని లేదా 97178 92020 ఫోన్ నంబర్‌ను సంప్రదించండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: షారుక్ ‘జవాన్’ ఖాతాలో మరో రికార్డ్
-
Tamilisai: నాపై రాళ్లు వేస్తే.. వాటితో భవంతి కడతా: గవర్నర్ తమిళిసై
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Nayanthara: సినిమా ప్రమోషన్‌కు అందుకే నయన్ దూరం: విఘ్నేశ్ శివన్
-
Jyotiraditya Scindia: మేనత్త త్యాగం.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో జ్యోతిరాదిత్య సింధియా?
-
TDP: చంద్రబాబు అరెస్టైన చోట.. తెదేపా పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ