JEE Main exam: ఆ సమాచారం నిజం కాదు.. నమ్మొద్దు: ఎన్‌టీఏ విజ్ఞప్తి

JEE Main 2023 session 2 exam జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారం అవాస్తవమని ఎన్‌టీఏ స్పష్టంచేసింది.

Updated : 29 Mar 2023 17:46 IST

దిల్లీ: జేఈఈ మెయిన్‌ సెషన్‌-2(JEE Main session 2) పరీక్షకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తిపై జాతీయ పరీక్షల మండలి(NTA) అప్రమత్తమైంది. ఏప్రిల్‌ 6 నుంచి 12వరకు జరిగే ఈ పరీక్షకు సంబంధించి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌, అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీలను తాము ఇంకా ప్రకటించలేదని స్పష్టంచేసింది. వీటి విడుదల తేదీలపై ‘అంతర్గత సమాచారం’ అన్నట్టుగా  సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు ప్రసారం అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించే ఇలాంటి వార్తల్ని ఖండిస్తున్నట్టు పేర్కొంది.  తప్పుడు సమాచారంతో వీడియోలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్‌ ఛానళ్ల వలలో పడొద్దని విద్యార్థులను కోరింది. పరీక్షలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌లు https://jeemain.nta.nic.in https://nta.ac.in/ను సందర్శించాలని NTA పునరుద్ఘాటించింది.  సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌, అడ్మిట్‌కార్డులను తమ అధికారిక వెబ్‌సైట్‌లోనే ఉంచుతామని.. ఎప్పటికప్పుడు అభ్యర్థులు చెక్‌ చేసుకోవాలని సూచించింది. పరీక్ష జరిగే నగరానికి సంబంధించిన సమాచారం, అడ్మిట్‌ కార్డుల కోసం ఏదైనా సమాచారం కావాలనుకుంటే  011-40759000 నంబర్‌కు గానీ లేదా ఈమెయిల్‌ jeemain@nta.ac.inను గానీ సంప్రదించవచ్చని సూచించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని