నాక్ (NAAC) వారిచే ఐదో అత్యుత్తమ (A++) గ్రేడు పొందిన అతి పిన్న అమృతా యూనివర్సిటీ! (ప్రకటన)
అనతి కాలంలోనే అందరూ కోరుకునే యూనివర్సిటీ గా ఆవిర్భావం!
అమృత యూనివర్సిటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఉన్నత విద్యను అందించే సంస్థలకు వాటి పనితీరుని బట్టి ర్యాంకులను ఇచ్చే నాక్ జాతీయ సంస్థ ఇచ్చిన అత్యుత్తమమైన ర్యాంకు A++ సాధించిన అతి పిన్న విద్యాసంస్థగా అమృత కు ఈ ఘనత దక్కింది.
ఇది ఒక్కటే కాకుండా 2021 NIRF ర్యాంకులలో 5వ ఉత్తమ భారతీయ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. అదే సంవత్సరం Impact ర్యాంకులలో ప్రపంచవ్యాప్తంగా 81 వ స్థానం పొందిన యూనివర్సిటీ గా నిలిచింది. దానితో పాటు గత కొన్ని సంవత్సరాలుగా QS ర్యాంకింగ్ లలో ఉత్తమ ప్రప్రంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందుతూ వస్తోంది.
18 సంవత్సరాలుగా ఇంత పేరును, గుర్తింపుని ఎలా తెచ్చుకోగలుగుతుంది, ఎలా ఇంత తక్కువ సమయంలో ఇది జరిగింది అన్నది చాలా ఆసక్తికరమైన విషయం. అమృతా యూనివర్సిటీ కి ఫరీదాబాద్ మరియు అమరావతి తో కలిపి దేశవ్యాప్తంగా ఆరు క్యాంపస్ లు ఉన్నాయి.
కోయంబత్తూరులో ప్రధాన కేంద్రం ఉంది. పశ్చిమ కనుమల్లో ఆహ్లాదకర వాతావరణంలో ఈ క్యాంపస్ కొలువుదీరి ఉంది. కొల్లాంలోని అమృతపురి క్యాంపస్, మైసూరులోని క్యాంపస్‌లు సైతం ప్రకృతి అందాల నడుమ కొలువుదీరాయి. వీటితో పాటు కోచి, చెన్నై, బెంగళూరు నగర శివార్లలో ప్రశాంత వాతావరణంలో విశాలమైన ప్రాంతంలో ఈ క్యాంపస్‌లు ఉన్నాయి. ఫరీదాబాద్, అమరావతిలో త్వరలో క్యాంపస్‌లు ప్రారంభం కానున్నాయి.
ఒకసారి క్యాంపస్‌లోకి అడుగు పెట్టి అక్కడి వారి మనసులోకి తొంగిచూస్తే బోధించే అధ్యాపకుడైనా, పనిచేసే సిబ్బంది అయినా, నేర్చుకునేందుకు వచ్చిన విద్యార్థి అయినా.. విలువలు, నమ్మకం, అభ్యాసనం చుట్టూనే వారి ఆలోచనలు తిరుగుతుంటాయి.
ముఖ్యంగా క్యాంపస్‌లో ఎవరిని పలకరించినా.. వారితో మాట్లాడినా అందరినోటా ఒకే మాట ‘‘అమృత విద్యా పీఠంలో జీవితానికి కావాల్సిన విద్యను, జీవించడానికి అవసరమైన విద్యను ఇక్కడ అభ్యసిస్తున్నాం’’ అని చెబుతారు అని యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ వెంకట్ రంగన్ తెలిపారు. జీవించడానికి అవసరమయ్యే చదువుతో పాటు, జీవితానికి సార్ధకత చేకూరే విద్యను అందించే లక్ష్యంగా ఇక్కడి విద్యార్థులను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.బోధనలోనే కాదు క్షేత్రస్థాయిలో వారికి అవే నేర్పిస్తామని చెప్పారు.
ఉదాహరణకు లివ్ ఇన్ ల్యాబ్స్ అనే కార్యక్రమాన్ని తీసుకుంటే.. విద్యార్థులు గ్రామీణ స్థాయిలో కొన్నాళ్ల పాటు ఉండి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటారు. కొన్నిసార్లు కొన్ని నెలల పాటు అక్కడే ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతారు. అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకోవడంతో పాటు వారి సమస్యలకు పరిష్కారాలు చూపుతారు.
దీనివల్ల విద్యార్థికి ఇదో అనుభవం మాత్రమే కాకుండా వారిలో ప్రపంచాన్ని చూసే దృక్కోణాన్ని కూడా మారుతుంది. ఇలా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు వందకు పైగా గ్రామాల్లో 2 లక్షల మంది ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 అంతర్జాతీయ యూనివర్సిటీలకు చెందిన 400 మందికిపైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
తమ యూనివర్సిటీ పరిశోధనల్లో ప్రేమ, కరుణ అనేవి అంతర్లీనంగా ఇమిడి ఉంటాయని స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ డాక్టర్ రఘు రామన్ తెలిపారు. కరుణ అనేది ఒక భావోద్వేగం మాత్రమే కాకుండా.. దాన్ని వాస్తవ రూపంలో ఎలా చూపించాలనేది తమ విద్యార్థులకు ఇక్కడ నేర్పిస్తామని వివరించారు. యూనివర్సిటీ ఛాన్సలర్ ఆకాంక్ష కూడా ఇదేనని పేర్కొన్నారు. చేసే ప్రతి పనిలోనూ సామాజిక కోణం ఉండాలన్నది యూనివర్సిటీ లక్ష్యమని.. సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్, ఆయుర్వేదం, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ ఇలా పరిశోధన ఏదైనా అందులో సామాజిక కోణం ఇమిడి ఉంటుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు దగ్గరగా యూనివర్సిటీ లక్ష్యాలు ఉంటాయని రామన్ వివరించారు.
అలా అమృత యూనివర్సిటీకి చెందిన 30 రీసెర్చ్ సెంటర్ల ద్వారా వెయ్యి మందికి పైగా స్కాలర్లు వాస్తవ ప్రపంచానికి అనుగుణంగా తమ పరిశోధనలు జరిపారు. ఒక్క 2016-21 మధ్య కాలంలోనే 59,800కు పైగా ప్రశంస తో కూడిన వివరణలు,12050కి పైగా ప్రచురణలు ప్రచురితమయ్యాయి. వాటి ప్రతిఫలాలు అపారం.
ఉదాహరణకు.. కొండచరియలు విరిగిపడటాన్ని ముందుగానే గుర్తించేందుకు ఉద్దేశించిన ‘ది వైర్‌లెస్ సెన్సర్ నెట్‌వర్క్ ఫర్ ల్యాడ్‌స్లైడ్ డిటెక్షన్’ అందులో భాగమే. ఎర్త్ సైన్స్, కమ్యూనికేషన్స్ అండ్ నెట్‌వర్కింగ్, అన్‌లాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్‌కు వంటి వివిధ అంశాలకు సమాహారంగా అతి తక్కువ ఖర్చుతో ఈ సిస్టమ్‌ను తయారు చేశారు ఇక్కడి విద్యార్థులు. దీని ద్వారా కొండచరియలు విరిగిపడడానికి 24 గంటల ముందే గుర్తించే వీలుంటుంది. దీనికి గానూ అమెరికా నుంచి పేటెంట్ కూడా లభించింది. అంతేకాదు వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ డిజార్ట్ రిస్క్ రిడక్షన్ నుంచి అమృత యూనివర్సిటీ అధికారిక గుర్తింపు పొందింది.
ఇలాంటిదే మరో పరిశోధన ఓషన్ నెట్. సముద్రంలో చేపల వేటకు వెళ్లే వారికి ఇంటర్నెట్ సదుపాయం అందించే వ్యవస్థ. దీని ద్వారా తీరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ అవాంతరాలు లేని ఇంటర్నెట్‌ను జాలర్లు పొందొచ్చు. అలాగే బ్రెయిన్ క్యాన్సర్ చికిత్సలో వినియోగించేందుకు నానో పాలిమర్ వేఫర్స్ రూపొందించడమే కాకుండా వాటిని విజయవంతంగా చికిత్సలో ఉపయోగించారు కూడా. అలాగే, కొబ్బరి సాగులో రైతులకు ఉపయోగపడేందుకు గానూ ఓ రోబోట్‌ను రూపొందించారు. దీనికి కోకోబాట్ అనే పేరు పెట్టారు. ఇది సకాలంలో దిగుబడుల అందించడంతో పాటు కొబ్బరికి తగిన మద్దతు ధర కల్పించడంలో సహాయపడింది.
అమృత వర్చువల్ ఇంటరాక్టివ్
లెర్నింగ్ వరల్డ్ (A-VIEW) ద్వారా నిజమైన తరగతి గది అనుభవం అందిస్తున్నారు. అలాగే ఐక్యరాజ్యసమితి సూచించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు చేరుకోవడంలో భాగంగా ది అమృత సెంటర్ ఫర్ రీసెర్చి ఇన్ అనలిటిక్స్, టెక్నాలజీస్ అండ్ ఎడ్యుకేషన్ (Amrita CREATE) ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ లెర్నింగ్ సొల్యూషన్స్ ద్వారా 21 రాష్ట్రాల్లోని 12వేల మంది స్కూళ్లలో సుమారు 50 వేల మంది టీచర్లు, 4 లక్షల మంది లెర్నర్లు ఇంటరాక్టివ్ సిములేషన్స్, యానిమేషన్స్ నేర్చుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో స్కూళ్లు మూతపడి, భౌతికంగా ల్యాబ్‌లు అందుబాటులో లేని సమయంలో సుమారు 34 లక్షల మందికి కంటే ఎక్కువ మంది ఆన్‌లైన్ ల్యాబ్‌లను వినియోగించుకున్నారు. అలాగే, దేశ ప్రజలు ఎక్కువ ఎదుర్కొంటున్న మధుమేహం సమస్యకు పరిష్కారం చూపుతూ తక్కువ ఖర్చుతో కూడిన ఇన్సులిన్ పంప్, నాన్-ఎంజైమాటిక్ గ్లూకోజ్ సెన్సార్‌లను అమృత స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ అభివృద్ధి చేసింది. దీనికి గానూ విప్రో టెక్నాలజీస్ అమెరికా నుంచి పేటెంట్ లైసెన్స్ పొందింది.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఒకేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు AMMACHI Labs ఏర్పాటు చేశారు. హాప్టిక్స్ వంటి అధునాతన సాంకేతికతలను వారి కోర్సుల్లో భాగం చేశారు. దీని ద్వారా మెరుగైన జీవనోపాధితో పాటు వారు గౌరవంగా జీవించేందుకు ఈ కోర్సులు ఉపయోగపడుతున్నాయి. గ్రామీణ ప్రాంత మహిళలకు సాధికారిత కల్పించే ఉద్దేశంలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్స్‌కు యునెస్కో నుంచి విమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ జండర్ ఈక్వాలిటీ గుర్తింపు కూడా పొందింది.
ఇక విద్యారంగంలో ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా అధిక యూనివర్సిటీలతో అమృత యూనివర్సిటీకి అనుబంధం ఉంది. దీంతో ఆయా యూనివర్సిటీల నుంచి ఇక్కడికి ఫ్యాకల్టీ వస్తుంటారు. మేధో సంపత్తి తరలిపోతోందనే ఆందోళనల నడుమ.. మేధో సంపత్తిని దిగుమతి చేసుకోవడంలో అమృత యూనివర్సిటీ ఈ విషయంలో కీలక భూమిక పోషిస్తోంది. ఇక్కడి విద్యనభ్యసించిన వారు ఆయా రంగాల్లో కీలకంగా మారుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన గూగుల్, సిస్కో, మైక్రోసాఫ్ట్, ఎస్‌ఏపీ వంటివి సంస్థలు నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలనుకున్నప్పుడు అమృత యూనివర్సిటీవైపే చూస్తుంటారు. దీంతో 95 శాతం మంది విద్యార్థులు ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీల్లో ఏడాదికి రూ.65 లక్షల వరకు ప్యాకేజీతో కొలువులు సాధిస్తున్నారు. ప్రపంచ కంపెనీలు ఇప్పుడు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం చూస్తున్నాయని, అందులోనూ ఆయా రంగంలో ప్రావీణ్యంతో పాటు లోతైన ప్రాపంచిక దృక్పథాన్ని కూడా కోరుకుంటున్నాయని యూనివర్సిటీ పూర్వ విద్యార్థి తేజస్‘ మేనన్ చెప్పారు. ప్రస్తుతం టెస్లాలో ఆయన ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
‘‘జీవితం, జీవనం రెండూ ఒకటి కాదు. జీవించడానికి ఉద్యోగం, డబ్బు, ఇల్లు, కారు ఇతర సౌకర్యాలు కావాలి. జీవితం సార్థకమవ్వాలంటే ప్రేమ, కరుణ, పరిపక్వత అవసరం. అవి ఆలోచనలతో పాటు ఆచరణలోనూ ఉండాలి’’ అంటారు యూనివర్సిటీ ఛాన్స్‌లర్ మాతా అమృతానందామాయీ దేవి. ఈ మాటలు చాలు మీలో ప్రేరణ నింపడానికి.
యూనివర్సిటీ అందించే ప్రోగ్రాములు, ఫ్యాకల్టీ, ఇతర యూనివర్సిటీలతో సహకారం, క్యాంపస్, అమృత యూనివర్సిటీకి సంబంధించిన ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27-06-2022)
-
World News
Most Expensive Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Sports News
Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్ క్రికెటర్
-
Movies News
Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- కూనపై అలవోకగా..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- Health: వృద్ధాప్యం వస్తే ఏం తినాలో తెలుసా..?
- E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?