AP High Court Results: జిల్లా కోర్టుల్లో 3,546 ఉద్యోగాలు.. రాత పరీక్ష ఫలితాలు విడుదల

ఏపీలో పలు జిల్లాల్లోని కోర్టుల్లో సిబ్బంది నియామకం కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు  ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌చేసి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

Updated : 29 Mar 2023 17:39 IST

అమరావతి: ఏపీలోని జిల్లా కోర్టుల్లో 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు(AP High court) నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.  జిల్లాల్లోని న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాల్లో భాగంగా డిసెంబర్‌ 22 నుంచి జనవరి 2 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.  జనవరి 4న కీని విడుదల చేసిన హైకోర్టు.. బుధవారం రాతపరీక్ష ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.  ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్‌ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్‌ టెస్టు, డ్రైవర్‌ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్‌ టెస్టును అదనంగా నిర్వహించనున్నట్టు హైకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు