AP Inter Exams: ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ ఇదే..

AP Inter Supplementary Exams: ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 

Updated : 27 Apr 2023 20:10 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల(AP Inter Supplementary exams)కు టైం టేబుల్‌ విడుదలైంది. మే 24 నుంచి జూన్‌ 1వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ ఇంటర్‌; మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్‌ బోర్డు(Inter board) కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు తెలిపారు. ఇంటర్‌ పరీక్ష ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదల కాగా.. 66.21శాతం ఉత్తీర్ణత నమోదైన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాలకు కలిపి 8,13,033 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. వారిలో 5,38,327మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

ప్రథమ సంవత్సరం టైమ్‌ టేబుల్‌

ద్వితీయ సంవత్సరం టైమ్‌ టేబుల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు