AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

ఏపీ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 18 Jun 2024 15:59 IST

అమరావతి: ఏపీ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మే 24 నుంచి జూన్‌ 1వరకు జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 1,27,190మంది (జనరల్‌, ఒకేషనల్‌ కలిపి) విద్యార్థులు హాజరు కాగా.. వీరిలో 74,868మంది (59%) ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జనరల్‌ కేటగిరీలో 59 శాతం, ఒకేషనల్‌లో 57 శాతం మంది చొప్పున పాసయ్యారు. 

ఇంటర్‌ ద్వితీయ సప్లిమెంటరీ ఫలితాలు (జనరల్‌)

ఇంటర్‌ ద్వితీయ సప్లిమెంటరీ ఫలితాలు (ఒకేషనల్‌)

ఎవరికైనా సందేహాలు ఉంటే సమాధాన పత్రాల రీ-వెరిఫికేషన్ కోసం జూన్‌ 20 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇందుకోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్‌ 26న విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని