AP Polycet 2023 Results: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. క్లిక్‌ చేసి తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి విడుదల చేశారు. ఈ ఏడాది జరిగిన పాలిసెట్‌కు 1,60,329 మంది దరఖాస్తు చేయగా 1,43,592(89.56%)మంది ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. 

Updated : 20 May 2023 11:15 IST

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి విడుదల చేశారు. ‘‘ఫలితాల్లో 86.35శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 15 మంది విద్యార్థులకు 120కి 120 మార్కులు వచ్చినట్లు’’ ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన పాలిసెట్‌కు 1,60,329 మంది దరఖాస్తు చేయగా 1,43,592(89.56%) మంది ప్రవేశపరీక్షకు హాజరయ్యారు.

పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 29 విభాగాల్లో మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు