AP EAPCET 2023: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలకు తేదీ ఖరారు.. రిజల్ట్స్ ఎప్పుడంటే..?
AP EAPCET 2023 Result: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 14న మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలు విడుదల చేస్తారు.
జేఎన్టీయూ(అనంతపురం): ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2023) ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూన్ 14న(బుధవారం) ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేస్తారని AP EAPCET ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ఆచార్య జి.రంగ జానార్ధన, కన్వీనర్ ఆచార్య సి. శోభా బిందు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామల రావు, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. మే 15 నుంచి 19వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇటీవల AP EAPCET 2023 ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసిన అధికారులు.. మే 24 నుంచి 26వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అనంతపురం జేఎన్‌టీయూ-ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన ఇంటర్ మార్కులకు 25శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు. ఫలితాలను www.eenadu.netలో తెలుసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Turkey: తుర్కియే పార్లమెంట్ వద్ద ఆత్మాహుతి దాడి
-
Anirudh: ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా: అనిరుధ్
-
Chatrapati Shivaji: 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరనున్న ఛత్రపతి శివాజీ ఆయుధం
-
Kuppam: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కుప్పంలో భారీ ర్యాలీ
-
LPG prices: వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారం.. రూ.209 పెంపు
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్