APPSC: ఏపీలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా.. కారణం ఇదే..!

APPSC group 1 mains exams: ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూల నేపథ్యంలో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది.

Updated : 28 Mar 2023 16:05 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 మెయిన్స్‌ (APPSC Group-1 mains) పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 23 నుంచి 29వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా జూన్‌ తొలి వారానికి వాయిదా వేశారు. ఏప్రిల్‌ 24 నుంచి మే 18వరకు సివిల్స్‌ ఇంటర్వ్యూలు ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను జూన్‌ 3 నుంచి 9వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు  వెల్లడించారు. నిన్న యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ తాజా నిర్ణయం తీసుకుంది. సివిల్స్‌ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి గ్రూప్‌ 1 పరీక్ష రాసే 25మంది అభ్యర్థులు హాజరు కావాల్సిఉంది. వారిని దృష్టిలో ఉంచుకొని అధికారులు గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల తేదీల్లో ఈ మార్పులు చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు