మెర్న్‌స్టాక్‌తో  మెరిసే కెరియర్‌!

నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి కంపెనీలు MERN స్టాక్‌లోని టెక్నాలజీలను ఉపయోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఎక్కువగా

Published : 15 Apr 2021 11:33 IST

నైపుణ్యాలు నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి కంపెనీలు MERN స్టాక్‌లోని టెక్నాలజీలను ఉపయోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఎక్కువగా వాడేది దీన్నే. MERN స్టాక్‌ నేర్చుకుంటే ఎన్నో అద్భుతమైన ఉద్యోగావకాశాలూ, ఆకర్షణీయమైన వేతనాలూ  లభిస్తాయి!       
మనం ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయాలంటే వెంటనే అమెజాన్‌ లేదా ఫ్లిప్‌కార్ట్‌ లాంటి వెబ్‌సైట్‌లోకి వెళతాం. కొనాలనుకున్న వస్తువులన్నీ రంగు రంగులతో ఒక పద్ధతిలో చక్కగా అమర్చి ఉంటాయి. ఇలా మనకు కనపడుతూ, ఇంటరాక్ట్‌ అవ్వడానికి వీలు కల్పించేదాన్ని ఫ్రంట్‌ ఎండ్‌ అంటారు.  
ఓలా, ఉబెర్‌ లాంటి అప్లికేషన్లను మనం తరచూ వాడుతుంటాం. అందులో మనం ఒక రైడ్‌ రిక్వెస్ట్‌ చెయ్యగానే మన దగ్గరలో ఉన్న డ్రైవర్లకు మన రైడ్‌ అభ్యర్థన వెళ్తుంది. అలానే ఒక డ్రైవర్‌ మన రిక్వెస్ట్‌ అంగీకరించగానే, వివరాలు ఒక నోటిఫికేషన్లో మనకు వస్తాయి. కేవలం ఒక రైడ్‌ రిక్వెస్ట్‌ పెట్టగానే ఇవన్నీ వాటికవే (ఆటోమేటిక్‌) జరిగిపోతున్నాయి. అలా జరగడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను డెవలప్‌ చేస్తారు. సాఫ్ట్‌వేర్‌ సర్వర్‌లో రన్‌ అవుతుంది. సర్వర్‌ అంటే ఒక కంప్యూటర్‌ లాగా మనం అనుకోవచ్చు. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ని రూపొందించడాన్ని బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ అంటారు. ఫ్రంట్‌ ఎండ్, బ్యాక్‌ ఎండ్‌లో చాలా టెక్నాలజీలు, ఫ్రేమ్‌వర్క్‌ ఉపయోగిస్తారు.  
నేడు పెద్ద సంఖ్యలో రకరకాల టెక్నాలజీలు ఉన్నాయి. మరి అందులో ఏం నేర్చుకోవాలి? ఏ టెక్నాలజీలను ఎక్కువ కంపెనీలు వాడుతున్నాయి? ఏవి నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయి?

కంపెనీలు ఎలా ఆలోచిస్తాయి?

ఈ రోజుల్లో అప్లికేషన్లను చాలా వేగంగా తయారు చేయడం తప్ప వేరే మార్గమే లేదు. అంత వేగంగా అప్లికేషన్లు తయారు చేయాలంటే ఒక డెవలపర్‌ గా మీరు ఉపయోగించే టెక్నాలజీలు కూడా చాలా ముఖ్యం. ఆ టెక్నాలజీలు మనం అర్థం చేసుకోవడానికి చాలా సులభంగా ఉండాలి. వాటితో మీరు చాలా వేగంగా అప్లికేషన్లను తయారు చేయగలగాలి. ఒక వెబ్‌సైట్‌ లేదా యాప్‌ని కొన్ని లక్షల మంది వాడుతారు. అంతమంది వాడుతున్నా కూడా ఆ అప్లికేషన్‌ తట్టుకునేలా టెక్నాలజీలను ఎంచుకోవాలి. ఇలా ఇవన్నీ ఆలోచించి ప్రతి కంపెనీ తమకంటూ ఒక ‘టెక్‌ స్టాక్‌’ను ఎంచుకుంటుంది.

ఇంతకీ స్టాక్‌ అంటే ఏంటి ?

మనం రోజూ ఉపయోగించే అమెజాన్, ఫేస్‌బుక్‌ లాంటి ప్రతి సాఫ్ట్‌వేర్‌నూ తయారు చేయడానికి వివిధ టెక్నాలజీలను ఉపయోగిస్తారు. ఇలా వెబ్‌సైట్స్, అప్లికేషన్లు అభివృద్ధి చేయడానికి ఉపయోగించే కొన్ని రకాల టెక్నాలజీలనూ, ఫ్రేమ్‌ వర్క్‌నీ కలిపి టెక్నాలజీ స్టాక్‌ అంటారు. ఈ స్టాక్‌లన్నిటినీ ఫ్రంట్‌ ఎండ్, బ్యాక్‌ ఎండ్‌ టెక్నాలజీల్లో విభజిస్తారు.  MERN స్టాక్, MEANస్టాక్, MEVN స్టాక్, JAM స్టాక్‌ ... ఇలా చాలా స్టాక్‌లు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌ తయారు చేసే అవసరాలను బట్టి స్టాక్, అందులో టెక్నాలజీలు కూడా మారుతూ ఉంటాయి. మనం తయారుచేసే సాఫ్ట్‌వేేర్స్‌ ఇంటరాక్టివ్‌గా ఉండాలంటే మనం ఉపయోగించే స్టాక్‌ అనేది చాలా ముఖ్యం. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఎక్కువగా వాడేది MERN స్టాక్‌. ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి మరెన్నో కంపెనీలు కూడా ఈ MERN స్టాక్‌లోని టెక్నాలజీలను ఉపయోగిస్తున్నాయి.

MERN స్టాక్‌ అంటే..

MERN స్టాక్‌ అనేది ఒక వెబ్‌ డెవలప్‌మెంట్‌ స్టాక్‌. Mongo DB, ExpressJS, React JS, and Node JS ’వీటిలోని నాలుగు కీలక టెక్నాలజీలు. ఈ MERN స్టాక్‌ లోని టెక్నాలజీలు వెబ్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ను సులభంగా చేయడానికి రూపొందించారు. 

సాధారణంగా ఒక అప్లికేషన్‌ని తయారు చేయాలంటే చాలా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజిలు ఉంటాయి. ఈ MERN స్టాక్‌లోJava Script  అనే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ని ముఖ్యంగా ఉపయోగిస్తారు. అలాగే అమెజాన్, ఫేస్‌బుక్‌..  ఇలా చాలా వెబ్‌సైట్‌లలో ఈ-మెయిల్, ఫోన్‌ నంబర్‌లతో రిజిస్టర్‌ అవుతుంటాô కదా. ఈ వివరాలన్నీ డేటాబేస్‌లో స్టోర్‌ అవుతాయి. ఈ డేటాబేస్‌ని మేనేజ్‌ చేసే చాలా టెక్నాలజీలు ఉంటాయి. వాటిలో ఒకటి Mongo DB. బ్యాక్‌ ఎండ్‌లో డెవలప్‌మెంట్‌లో ఉన్న వివిధ టెక్నాలజీల్లో అత్యంత ప్రాచుర్యం పొందినవాటిలో Node JS ఒకటి.  Express JSతో  బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌లో ఉపయోగించే ఒక ఫ్రేమ్‌వర్క్‌. Node JS తో బ్యాక్‌ ఎండ్‌ అప్లికేషన్లు రాయడానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ Express JS.  ఇక  React JS విషయానికి వస్తే ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌లో బాగా ప్రాచుర్యం పొందిన టెక్నాలజీ ఇది. దీన్ని ఫేస్‌బుక్‌ సంస్థ అభివృద్ధి చేసింది.ఈ  MERN స్టాక్‌ నేర్చుకునే ముందు ప్రోగ్రామింగ్‌ ఫండమెంటల్స్‌పై పట్టు సాధించాలి. అలానే  HTML, CSS & Java Script ని ముందుగా నేర్చుకోవాలి.

ఎందుకు నేర్చుకోవాలి?

MERN స్టాక్‌లో ప్రధానంగా Java Script ఉపయోగిస్తాం. దీన్ని ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలోనే చాలా ఎక్కువ మంది వాడుతున్నారు. Java Script నేర్చుకోవడం చాలా సులభం. అలాగే అప్లికేషన్లు కూడా చాలా వేగంగా తయారుచేయవచ్చు. అందుకే పరిశ్రమలో, వివిధ కంపెనీల్లో దీనికి డిమాండ్‌ చాలా ఎక్కువ. ఈ Java SCriptను ఫ్రంట్‌ ఎండ్, బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌- రెండింటిలోనూ ఉపయోగిస్తారు. కాబట్టి MERN స్టాక్‌  నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

భారీ జీతాలు 

గ్లాస్‌డోర్‌ సంస్థ సమాచారం ప్రకారం- భారత్‌లో ఫుల్‌స్టాక్‌ అప్లికేషన్‌ డెవలపర్లకు మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. ప్రాథమిక స్థాయిలో ఈ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ నేర్చుకుంటేనే సంవత్సరానికి 6 లక్షలు ఇచ్చే ఉద్యోగాలు వస్తాయి. పే స్కేల్‌ అందించిన సమాచారం చూస్తే..అమెరికాలో ఈ అప్లికేషన్‌ డెవలపర్ల మూల వేతనం 91,000 డాలర్లు. అంటే సుమారుగా 66 లక్షల రూపాయిలు!

నాలుగున్నర నెలల్లోనే...

లక్షల జీతాలు వచ్చే ఈ MERN స్టాక్‌ ఉద్యోగాలకు గిరాకీ చాలా ఎక్కువగా ఉంది. ఇందులో నైపుణ్యం ఉన్నవారికి కంపెనీలు లక్షల్లో వేతనాలు ఇస్తున్నాయి. ఎన్నో సంస్థలు దీనిలో శిక్షణను అందిస్తున్నాయి. ఉదాహరణకు.. CCBP  టెక్‌ 4.0 ఇంటెన్సివ్‌ ప్రోగ్రాంను 4.5 నెలల కాల వ్యవధితో ముగిసేలా రూపొందించారు (వెబ్‌సైట్‌:  ‘‘ccbp.in//intensivez). సంబంధిత నైపుణ్యాలను నేర్చుకున్నవారు సంవత్సరానికి 4.5 లక్షల నుంచి 9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం తెచ్చుకోవచ్చు. ఈ తరహా ప్రోగ్రాంలలో చేరటానికి కోడింగ్‌పై ఎటువంటి అవగాహనా అవసరం లేదు. క్లిష్టమైన అంశాలను నిపుణుల సాయంతో తేలికగా అర్థం చేసుకోవచ్చు.  
రాహుల్‌ అత్తులూరి సీఈఓ నెక్స్‌ట్‌ వేవ్‌
suppport@nxtwave.tech


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని