CBSE: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల

CBSE supplementary exams: సీబీఎస్‌ఈ సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్లు విడుదలయ్యాయి. 

Updated : 01 Aug 2023 16:46 IST

దిల్లీ: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడులైంది. జులై 17 నుంచి 22వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు డేట్‌ షీట్లను సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ డా.సన్యం భరద్వాజ్‌ విడుదల చేశారు. జాతీయ విద్యా విధానం (NEP-2020) సిఫారసుల ఆధారంగా కంపార్ట్‌మెంట్‌పరీక్ష అనే పేరును సప్లిమెంటరీగా మార్చారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు తమ పెర్ఫామెన్స్‌ను మెరుగుపరుచుకొనేందుకు కూడా బోర్డు అవకాశం కల్పించింది. పదో తరగతి విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకొనేందుకు రెండు సబ్జెక్టులను సప్లిమెంటరీలో భాగంగా రాసుకొనేందుకు వెసులు బాటు కల్పించిన సీబీఎస్‌ఈ అధికారులు.. 12వ తరగతి విద్యార్థులకు ఒక సబ్జెక్టులో మాత్రమే అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

సీబీఎస్‌ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష డేట్‌ షీట్‌

సీబీఎస్‌ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష డేట్‌ షీట్‌

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని