CBSE 2023 Results: సీబీఎస్‌ఈ 10,12 తరగతి ఫలితాలు ఎప్పుడు? ఎలా చెక్ చేసుకోవాలంటే?
CBSE 2023 Results: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చే వారం రోజుల్లోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు సీబీఎస్‌ఈ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రటకన వెలువడలేదు.
దిల్లీ: లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ వారంలోనే ఏప్రిల్ 30 నాటికి పరీక్షల ఫలితాలను సీబీఎస్‌ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఫలితాల విడుదలకు సంబంధించి సీబీఎస్‌ఈ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విద్యార్థులు తాము సాధించిన స్కోరును cbse.gov.in, results.cbse.nic.in వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. అడ్మిట్‌కార్డు, రిజిస్ట్రేషన్ వివరాలను విద్యార్థులు తమకు అందుబాటులో ఉంచుకోవాలి.
ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21వరకు సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు జరగ్గా.. ఫిబ్రవరి 15నే 12వ తరగతి పరీక్షలూ ప్రారంభమయ్యాయి. అయితే, తుది పరీక్ష మాత్రం ఏప్రిల్ 5న ముగిసింది. దేశవ్యాప్తంగా 10, 12వ తరగతి పరీక్షలను దాదాపు 38లక్షల మంది విద్యార్థులు రాశారు. పదో తరగతి పరీక్షలకు 21 లక్షల మందికి పైగా విద్యార్థులకు పైగా హాజరు కాగా.. 12వ తరగతి బోర్డు పరీక్షలను 16లక్షల మందికి పైగా రాశారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
- సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- యాక్టివ్ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి
- కొత్త పేజీ డిస్‌ప్లే అవుతుంది.
- మీ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయాలి.
- మీరు సాధించిన స్కోరు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ఆ కాపీని ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
రుషికొండపై చకచకా పనులు
-
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం.. క్రికెట్ సహా 3 పతకాలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
24సార్లు వినతిపత్రాలు ఇచ్చినా.. వందల సార్లు ఫిర్యాదుచేసినా..!
-
Tirumala Brahmotsavam: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
-
రాత్రివేళ రెండేళ్ల పాప అదృశ్యం.. డ్రోన్లు, జాగిలాలతో పోలీసుల జల్లెడ